ఈ ఛండాలమంతా బెజవాడలో జరిగింది
మానవ సంబంధాలు మరీ చెత్తగా మారుతున్నాయా? అన్న భావన కలగటం ఖాయం. భార్యా..భర్తల మధ్య సంబంధాలు రోజురోజుకీ తగ్గిపోవటమే కాదు.. నమ్మకం పాళ్లు ప్రశ్నగా మారుతోంది. దీనికి తగ్గట్లే ఇటీవల కాలంలో వెలుగు చూస్తున్న ఉదంతాలే నిదర్శనంగా చెప్పక తప్పదు.
ఇప్పటికే భర్తను భార్యలు చంపటం.. అదేరీతిలో భార్యల్ని భర్తలు కడతేర్చటం లాంటివి తరచూ చోటు చేసుకుంటున్నాయి. ఇదిలా ఉంటే.. కొత్త తరహా దరిద్రం ఒకటి తాజాగా బయటకు వచ్చింది. బెజవాడలో వెలుగు చూసిన ఈ వైనం విన్నంతనే చిరాకు పుట్టటమే కాదు.. ఇదెక్కడి దరిద్రం రా బాబు అన్న భావన కలుగుతుంది.
బెజవాడలోని కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని పాత రాజరాజేశ్వరిపేట జెండా చెట్టు ప్రాంతంలో మల్లికా సుల్తానా అనే 27 మహిళకు భవానీపురానికి చెందిన రియాజ్ అనే వ్యక్తితో పెళ్లి జరిగింది. అయితే.. వీరిద్దరికి గతంలో పెళ్లిళ్లు జరిగి విడాకులు తీసుకున్నారు. రెండో పెళ్లి అయినా.. కట్న కానుకులకు ఎలాంటి లోటు లేకుండా చూశారు అత్తమామలు.
పాత టైర్ల వ్యాపారం చేసే రియాజ్ కు కడప జిల్లాకు చెందిన రహమాన్ అనే స్నేహితుడు ఉండేవాడు. అప్పుడప్పుడు కడప జిల్లా నుంచి బెజవాడకు భార్యతో పాటు వచ్చేవాడు. ఫ్యామిలీ ఫ్రెండ్స్ గా ఉండే వీరి మధ్యన ఏం పోయే కాలం వచ్చిందో కానీ.. సుల్తానా అంటే తనకు ఇష్టమని తనను పెళ్లి చేసుకోవాలంటూ రహమాన్ ఇబ్బంది పెట్టటం మొదలెట్టాడు.
ఊహించని ఈ వైనంతో బెదిరిపోయిన సుల్తానా ఈ విషయాన్ని భర్తకు చెప్పి వాపోయింది. మౌనంగా ఉన్న భర్త నుంచి స్పందన లేకపోవటంతో సుల్తానాకు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి. ఇదిలా ఉండగా.. ఈ మధ్యన సుల్తానాకు రహమాన్ భార్య ఫోన్ చేసి.. "నువ్వంటే నా భర్తకు ఇష్టం. అతన్ని పెళ్లి చేసుకో. నేనేం అభ్యంతరం పెట్టను" అని చెప్పటంతో నోట మాట రాని పరిస్థితి. ఇదే విషయాన్ని మళ్లీ భర్తతో చెబితే.. వ్యాపారం కోసం కొంత డబ్బు తీసుకున్నాను.. అతన్ని పెళ్లి చేసుకో.. లేకుండా అప్పు తీర్చమని ఇబ్బంది పెడతాడన్న మాటతో ఆమె షాక్ తింది. భర్త మాటకు ససేమిరా అన్న కోపంతో సుల్తానాను తీవ్రంగా కొట్టటమే కాదు.. పుట్టింటికి పంపేశాడు. దీంతో.. తనకు న్యాయం జరగాలంటూ సుల్తానా పోలీసుల్ని ఆశ్రయించింది. అండగా ఉండాల్సిన భర్తే.. ఇలా ఫ్రెండ్ ను పెళ్లి చేసుకోవాలన్న ఈ ఉదంతం సంచలనంగా మారింది.