భార్య బయటకు వెళ్లొద్దన్నదని ఉరేసుకున్న భర్త

Update: 2020-04-23 04:16 GMT
కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ లో సిత్రమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. చిన్న విషయాలకే తీవ్ర మనస్తాపానికి గురైపోతున్న వైనాలు బయటకు వస్తున్నాయి. తాజాగా అలాంటి ఉదంతమే తెలంగాణలోని సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలో చోటు చేసుకుంది. లింగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన అరవైఏళ్ల రాముల కొడుకుతో కలిసి గజ్వేల్ లో ఎరువుల వ్యాపారం చేస్తుంటాడు.

లాక్ డౌన్ కారణంగా దుకాణాన్ని మూసి వేశారు. దీంతో కుటుంబం మొత్తం స్వగ్రామమైన లింగారెడ్డి పల్లికి చేరుకున్నారు. ఊరికి వెళ్లిన తర్వాత ఇంట్లో ఉండని రాములు అదే పనిగా బయటకు వెళుతుండేవాడు. దీనికి ఆయన భార్య అభ్యంతరం వ్యక్తం చెబుతుండేది. తాజాగా భార్య మాట వినకుండా గజ్వేల్ కూడా వెళ్లి వచ్చాడు. భర్త తీరుపై భార్య ఆవేదనగా.. బయటకు వెళ్లటం ప్రమాదకరమని చెబుతున్నారు.. ఇలా వెళితే ఎలా? ఊరికే బయటకు వెళుతున్నారెందుకు? అంటూ భర్తను ప్రశ్నించింది.

ఈ నేపథ్యంలో భార్యభర్తలిద్దరి మధ్య వాదన చోటు చేసుకుంది. భార్య తనను ప్రశ్నించటాన్ని జీర్ణించుకోలేని భర్త తీవ్ర మనస్తాపానికి గురైంది. అంతే.. బుధవారం తెల్లవారుజామున ఇంటి సమీపంలోని మామిడి చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఉదంతం షాకింగ్ గా మారింది. ఏ భర్తను కాపాడుకోవాలన్న తపనతో.. ఆయన్ను బయటకు వెళ్లొద్దని ఆరాటపడిన ఆ భార్యకు భర్త చర్య శరాఘాతంగా మారిన పరిస్థితి. ఇంట్లో నుంచి బయటకు వెళ్లొద్దన్నందుకే ఆత్మహత్య చేసుకోవటమా? అని అవాక్కు అవుతున్నారు.
Tags:    

Similar News