రాజధానిలో విషాదం: వంద ఆవులు మృతి!
ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో ఊహించని సంఘటన చోటు చేసుకుంది. సీఎం జగన్ నివాసముంటున్న తాడేపల్లిలోని గోశాలలో విషం ఉన్న దాణా తిని వంద ఆవులు మృతి చెందాయి. ఇంకా వందల ఆవుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయంలో గోశాల నిర్వహకులపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
నిన్న సాయంత్రం వరకు బాగానే ఉన్న ఆవులు తెల్లారేసరికి మృత్యవాతన పడ్డాయి. అర్థరాత్రి సమయంలో పశువులకు పెట్టిన దాణాలో ఏమైనా విష పదార్థాలు కలిశాయా? లేదా పచ్చ గడ్డిపై క్రిమి సంహారక మందు ఉన్నందువల్ల తిని చనిపోయాయా? దాణా ఎవరు పెట్టారు? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు.
అలాగే గోశాల నిర్వాహకులు దాణా విషయంలో ఎవరికి అనుమతి ఇచ్చారనే కోణంలో కూడా విచారణ సాగుతోంది. అయితే చనిపోయిన ఆవులకు పోస్ట్ మార్టం చేసిన తరువాత వాటి మృతికి కారణం చెబుతామని వైద్యులు తెలిపారు. అయితే మరికొన్ని ఆవులు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాయి. వాటికి డాక్టర్లు వైద్యం అందిస్తున్నారు.
ఇక గతంలో కూడా ఇదే గోశాలలో విష దాణా కారణంగా 24 గోవులు చనిపోయినట్లు స్థానికులు తెలిపారు. ఇదిలా ఉంటే ఒకేసారి 100 గోవులు చనిపోవడంపై గో సంరక్షణ కార్యదర్శి సాహు తీవ్ర విచారణం వ్యక్తం చేశారు. ఘటన జరగడం బాధకరమన్నారు. ఆవుల చనిపోవడానికి గల కారణాలని తెలుసుకుని తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.