సైకిళ్ళకు పెరిగిపోతున్న డిమాండ్
కరోనా వైరస్ వల్ల నష్టాలే కాదు లాభాలు కూడా కన్నున్నాయి. ఇందులో భాగమే జనాల్లో పెరిగిన ఆరోగ్య స్పృహ. కరోనా వరస్ కారణంగా దేశం దాదాపు నాలుగు మాసాలు లాక్ డౌన్లో ఉండిపోయింది. ఇపుడు అన్ లాక్ జరుగుతున్నా 100 శాతమైతే జనజీవనం ఇంకా సాధారణ స్ధితికి రాలేదు. కంప్లీట్ లాక్ డౌన్ కారణంగా జరిగిందేమంటే దేశంలోని వివిధ వర్గాల్లోని జనాలంతా దాదాపు ఇళ్ళకే పరిమితమైపోయారు. ఈ కారణంగా చాలా కాలంగా ఊబకాయం పెరిగిపోయింది. చాలామందికి బయట తిరిగే అవకాశం లేకపోవటంతో ఊరికే తినటం ఇంట్లోనే కూర్చోవటంతోనే లాక్ డౌన్ను కాలాన్ని గడిపేశారు.
పోలీసులు, ఆరోగ్య కార్యకర్తలు, వైద్య, ఆరోగ్య సిబ్బందితో పాటు మున్సిపల్ సిబ్బంది లాంటి అత్యవసర సర్వీసుల ఉద్యోగులు మాత్రమే లాక్ డౌన్లో కూడా పనిచేశారు. మిగిలిన వాళ్ళు ఊరికే తిని ఇంట్లోనే కూర్చోవటం వల్ల బరువు పెరిగిపోయారట. ఏదో ఐటి రంగంలోని నిపుణులు వర్క్ ఫ్రం హోం చేసినా అది కూడా ఇంట్లోనుండి కదలకుండానే కాలం గడచిపోయింది. అందుకే పెరిగిపోయిన బరువును తగ్గించుకోవటం కోసం అన్ లాక్ ప్రక్రియ మొదలవ్వగానే సైకిళ్ళు కొనటం మొదలుపెట్టారట.
కసరత్తుకు సైకిల్ తొక్కటానికి మించినది మరేదీ లేదని ఇప్పటికే డాక్టర్లు, వ్యాయమ నిపుణులు చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. అందుకనే అందరు మామూలు సైకిళ్ళను అవకాశం ఉన్నవాళ్ళు ఎక్సర్ సైజుల కోసం తయారు చేసిన ప్రత్యేకమైన సైకిళ్ళను కొంటున్నారట. మొన్నటి మేనెల నుండి సప్టెంబర్ నెల మధ్యలో దేశవ్యాప్తంగా 42 లక్షల సైకిళ్ళు అమ్ముడుపోయాయంటే మామూలు విషయం కాదు. ఐదేళ్ళకు ముందు సైకిళ్ళ కొనుగోలు దేశవ్యాప్తంగా తగ్గిపోయింది. దీని కారణంగా అట్లాస్ లాంటి ప్రముఖ సైకిళ్ళ తయారీ సంస్ధ మూతపడిపోయింది.
అయితే కరోనా వైరస్ కారణంగా పెరిగిపోయిన బరువును తగ్గంచుకుని ఒబెసిటి నుండి బయటపడటానికి చాలామంది మళ్ళీ సైకిళ్ళను కొంటున్నారట. ఇమ్యునిటి ఎక్కువున్న వాళ్ళకు కరోనా వైరస్ సోకే అవకాశాలు తక్కువని డాక్టర్లు చెబుతున్న మాటలు జనాలకు బాగానే ఎక్కుతున్నట్లుంది. అందుకనే ప్రముఖ నగరాలు, పట్టణాలు, గ్రామాలనే తేడా లేకుండా చాలామంది సైకిళ్ళ కోసం ఎగబడుతున్నారు. ఒక్కసారిగా సైకిళ్ళకు గిరాకీ పెరిగిపోవటంతో ఉత్పత్తి చేయటం కూడా కష్టమైపోయింది. అందుకనే కొన్ని నగరాల్లో సైకిళ్ళ అమ్మకాలకు బుకింగ్ సిస్టమ్ ప్రవేశపెట్టారట. ముందుగా బుక్ చేసుకుంటే కానీ సైకిళ్ళను డెలివరీ చేయలేకపోతున్నట్లు సమాచారం. కరోనా వైరస్ కారణంగా నష్టాలతో పాటు లాభాలు కూడా ఉన్నాయని అంగీకరించాల్సిందే.