బీజేపీ రఘునందన్ కు సొంతూరు లో ఎంత మెజారిటీ వచ్చిందంటే ?
దుబ్బాక అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో తన స్వగ్రామంలో బీజేపీ అభ్యర్ధి రఘునందన్ రావుకు తన సత్తా చూపించారు. ప్రత్యర్ధుల కంటే ముందంజలో ఉన్నారు. బీజేపీ అభ్యర్ధి రఘునందన్ రావు స్వగ్రామం దుబ్బాక మండలంలోని బొప్పాపూర్. ఈ గ్రామంలో రఘునందన్ రావుకు 424 ఓట్లు వచ్చాయి. టీఆర్ ఎస్ అభ్యర్ధి సోలిపేట సుజాతకు 147 ఓట్లు వచ్చాయి. రఘునందన్ రావుకు తన సమీప ప్రత్యర్ధి సుజాత కంటే 277 ఓట్ల ఆధిక్యంలో నిలిచారు.
మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి స్వగ్రామం పోతారంలో బీజేపీ అభ్యర్ధి 110 ఓట్ల ఆధిక్యంలో నిలిచారు. పోతారంలో టీఆర్ఎస్ అభ్యర్ధి సుజాత కంటే బీజేపీ అభ్యర్ధి రఘునందన్ రావుకు 110 ఓట్ల ఆధిక్యత లభించింది. చిట్టాపూర్ లో టీఆర్ఎస్ అభ్యర్ధి సుజాతకు 846 ఓట్లు వచ్చాయి.ఇదే గ్రామంలో బీజేపీ అభ్యర్ధి రఘునందన్ రావు కి 406 ఓట్లు దక్కాయి. ఈ గ్రామంలో బీజేపీ కంటే 440 ఓట్ల మెజారిటీ వచ్చింది. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల కౌంటింగ్ లో ఎనిమిది రౌండ్లలో ఐదు రౌండ్లలో బీజేపీ అభ్యర్ధి రఘునందన్ రావు ఆధిక్యంలో కొనసాగగా , ఆ తర్వాత వరుసగా 6,7 రౌండ్లలో టీఆర్ ఎస్ మెజార్టీ సాధించి బీజేపీ ఆధిక్యాన్ని తగ్గిస్తోంది. ఆ తర్వాత తాజాగా ఎనిమిదో రౌండ్ లో మళ్లీ తన ఆధిక్యాన్ని చూపించి మెజారిటీని పెంచుకుంది. ఎనిమిది రౌండ్లు పూర్తయ్యేసరికి బీజేపీ 3,106 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది