భారత్లో స్మార్ట్ ఫోన్ ఎన్ని కోట్లమందికి ఉందంటే?
స్మార్ట్ ఫోన్ .. ప్రస్తుత రోజుల్లో చిన్న, పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ స్మార్ట్ ఫోన్స్ ను వాడేస్తున్నారు. స్మార్ట్ ఫోన్ ప్యాకెట్ లో ఉంటే ప్రపంచం మొత్తం మన జేబులో ఉన్నట్టే. ఇక మనదేశంలో స్మార్ట్ ఫోన్స్ కి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే భారత్ లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పకపోయినా , మార్కెట్ డిమాండ్ కు అణుగుణంగానే కొత్తకొత్త బ్రాండ్‌లు, మోడళ్లు మార్కెట్‌లో కి వస్తున్నాయి.
ఒకప్పుడు ఫోన్ అంటే , ఆపద లేక అవసర సమయాల్లో అక్కడి లేని వారితో మాట్లాడటానికి మాత్రమే వినియోగించే వారు. కానీ , స్మార్ట్ ఫోన్స్ వాడకం పెరిగిపోయిన తర్వాత కనీసం పక్కన ఉన్న వారిని పలకరించడానికి కూడా టైం లేనంతగా బిజీ అయిపోయారు. పొద్దున్న లేచినప్పటి నుండి రాత్రి కాదు కాదు అర్ధరాత్రి మళ్లీ నిద్రపోయే వరకు స్మార్ట్ ఫోన్ .. స్మార్ట్ ఫోన్. రెండు మూడు రోజులు భోజనం చేయకుండా ఉంటారేమో కానీ .. స్మార్ట్ ఫోన్ చేతిలో లేకపోతే క్షణం కూడా ఉండలేరు.
అంతలా మారిపోయింది జీవితం. సెల్ ఫోన్ లో కార్టూన్లో, రైమ్సో పెడితేగాని, చిన్న పిల్లాడు తిండి తినని రోజులివి. చిన్న పిల్లలు మొదలుకొని ప్రతీ ఒక్కరికీ... అవసరం ఉన్నా, లేకపోయినా సెల్ ఫోన్ ఒక వ్యసనంగా మారిందనే చెప్పాలి. చేతిలో ఫోన్ ఉంటే చాలు ఏమి తింటున్నామో తెలీకుండానే తింటున్నాం. ప్రతీ విషయానికి ఫోన్ ద్వారానే పరిష్కారం వెతుక్కుంటున్నాం. ఎప్పుడూ ఫోన్ మనవద్ద ఉండాల్సిందే. చివరకు పడుకునే సమయంలోనూ ఫోన్ ను పక్కనే పెట్టుకుంటున్న కాలం ఇది.
ఇక మార్కెట్ లో డిమాండ్ కి తగ్గట్టుగా ప్రతినెలా పదుల సంఖ్యలో మొబైల్ మోడల్స్ వెలుగులోకి వస్తున్నాయి. ఇక చౌకైన డేటా ఆఫర్లు, అందుబాటు ధరల్లో ఫోన్లతో దేశంలో స్మార్ట్ ఫోన్ వినియోగం నానాటికీ పెరిగిపోతోంది. ముఖ్యంగా దేశంలో జియో వచ్చాకా డేటా మరింత చీఫ్ అయిపోయింది. దీనితో ప్రతి ఒక్కరూ కూడా స్మార్ట్ ఫోన్ అంటూ ఎగబడుతున్నారు.
ఈ క్రమంలో స్మార్ట్ ఫోన్లు వాడేవారి సంఖ్య తామరతుంపరగా పెరిగిపోతోంది. ఇంటర్నెట్ వ్యాపారాలు పెరిగిపోతూండడం, విద్యార్థుల ఆన్ లైన్ తరగతులతో మొబైల్ ఫోన్ల అమ్మకాలు అనూహ్యంగా పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు స్మార్ట్ ఫోన్స్ వద్దనే పేరెంట్స్ , టీచర్స్ ఇప్పుడు మొబైల్ లో క్లాసులు వినండి అంటూ చెప్తుండటంతో..పిల్లలు కూడా స్మార్ట్ ఫోన్ కి బాగా అడిక్ట్ ఐపోతున్నారు.
అయితే తాజాగా న్యూజూ అనే సంస్థ.. ఆయా దేశాల్లో స్మార్ట్ ఫోన్ వినియోగదారుల గణాంకాలను విడుదల చేసింది. దీని ప్రకారం... 91.2 కోట్ల మంది స్మార్ట్ ఫోన్ వినియోగదారులతో చైనా తొలిస్థానంలో ఉండగా, భారత్ 43.9 కోట్ల మంది వినియోగదారులతో రెండో స్థానంలో ఉంది. ఆపై వరుసగా అమెరికా, ఇండోనేషియా, బ్రెజిల్, రష్యా, జపాన్, మెక్సికో దేశాలున్నాయి.
అమెరికాలో 27 కోట్ల మంది స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఉన్నారు. 16 కోట్ల మందితో ఇండోనేసియా నాలుగో స్థానంలో నిలిచింది. బ్రెజిల్ లో 10.9 కోట్ల మంది స్మార్ట్ ఫోన్ యూజర్లు ఉన్నారు. రష్యాలో 10 కోట్ల మంది స్మార్ట్ ఫోన్ ను కలిగి ఉన్నారు. జపాన్లో 7.6 కోట్ల మంది స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. 7 కోట్ల మంది వినియోగదారులతో మెక్సికో ఎనిమిదో స్థానం సంపాదించింది. కనీసం నెలకు ఒకసారి మొబైల్ ఫోన్ ను ఉపయోగించే వ్యక్తిని క్రియాశీల వినియోగదారుగా పరిగణించింది ఈ అధ్యయనాన్ని చేపట్టినట్లు 'న్యూజూ' తెలిపింది.