• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  అమెరికా దారుణం: శవాలను...

అమెరికా దారుణం: శవాలను తీసుకోవడం లేదు..

By - Tupaki Desk
Update: 2020-04-07 09:50 GMT
అమెరికాలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. జనాలు కరోనాతో పిట్టల్లా రాలుతున్న పరిస్థితి దాపురించింది. మృతదేహాలను ఖననం చేయడానికి కూడా స్థలాల కొరత ఉంది.  వీల్లేని పరిస్థితుల్లో మార్చురీల్లో భద్రపరుస్తారు. కరోనాతో మృతి చెందిన వారిని తీసుకెళ్లలేని దైన్యం కనిపిస్తోంది.

అమెరికాలో కరోనా బాధితుల సంఖ్య 3.37లక్షలకు చేరింది. మరణాల సంఖ్య 9620కు చేరువగా ఉంది.  అమెరికాలో ఈరోజు 330 మందికి పైగా ప్రజలు వైరస్ బారిన పడ్డారు. సామాన్యులు ఇంట్లో నుంచి అడుగు బయటపెట్టడం లేదు. ఇక వైద్యులు  ఆరోగ్య కార్యకర్తలు ఇష్టపూర్వకంగా తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. వారు ఇంటికి కూడా వెళ్లకుండా సేవలందిస్తున్న స్థితి అమెరికాలో నెలకొంది.

అగ్రరాజ్యం అమెరికాలో ముఖ్యంగా శ్రీమంతుల నగరంగా పేరుగాంచిన న్యూయార్క్ లో ఈ వైరస్ దెబ్బకు అతలాకుతలం అవుతోంది. ఈ ప్రాంతంలో వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. మృత్యువాత పడుతున్న వారి సంఖ్య వేలల్లో ఉంటోంది.

న్యూయార్క్ నగరంలో భయానక పరిస్థితులున్నాయి. ఇప్పటివరకు కరోనా బాధితుల సంఖ్య లక్ష దాటిపోయింది. 4వేలమందికిపై గా మరణించారు. మరణాల సంఖ్య పెరుగుతుండడంతో శ్మశాన వాటికల వద్ద తీవ్ర రద్దీ నెలకొంది. నిర్వాహకులపై ఒత్తిడి పెరుగుతోంది. ఒత్తిడి తట్టుకోలేక శ్మశాన వాటికల నిర్వాహకులు చేతులు ఎత్తివేస్తున్నారు.

దీంతో కరోనా డెడ్ బాడీలను కొంతకాలం పాటు ఆస్పత్రి మార్చురీలోనే భద్ర పరుస్తున్నారు. అయితే కొందరు కరోనాతో మృతిచెందిన తమ కుటుంబ సభ్యుల బాడీలను తీసుకెళ్లడం లేదు. దీంతో వారంతా అనాథ శవాలుగా మార్చురీలోనే ఉంటున్న దైన్యం కనిపిస్తోంది.

న్యూయార్క్ లోని బ్రూక్లిన్ శ్మశనా వాటికలో ఒకేసారి కేవలం 60 మృతదేహాలను ఖననం చేసే వీలుంది. అయితే న్యూయార్క్ లో ఒకేరోజు 200 మరణాలకు మించి నమోదై మృతదేహాలు రావడంతో ఏం చేయాలో పాలు పోక నిర్వాహకులు తలలు పట్టుకుంటున్నారు. ఖననం చేసే వీలు లేక రసాయనాలు పూసి మార్చురీ ఏసీ గదుల్లో భద్ర పరుస్తున్న పరిస్థితి ఉంది. కుటుంబ సభ్యులు కూడా కరోనా తో చనిపోయిన వారి శవాల కోసం అడగక పోవడం దారుణంగా ఉంది.  ఇక శవాలను భద్రపచడానికి అమెరికాలో ఆరెంజ్ బ్యాగుల కొరత తీవ్రంగా ఉంది. దీంతో దేంట్లోనే సంచుల్లో కుక్కి మార్చురీలో భద్రపరుస్తున్న దుస్థితి నెలకొంది.
Tags:    
  • Hospitals overflowing with bodies in US 
  • Corona Virus In America 
  • Telugu News 
  • Latest Telugu News 
  • Telugu Daily News 
  • Telugu News Updates 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

టీటీడీకి లేట‌య్యే కొద్దీ.. 'కాంపిటీష‌న్' పెరుగుతోందిగా..!

2026-11-06 12:30 GMT

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

రూ. 40 కోట్లా? ఐపీఎల్ వేలానికి ముందే ఆటగాళ్ల డిమాండ్లు వైరల్

2026-11-06 07:49 GMT

Copyright @2026

Powered by Blink CMS