తల్లిదండ్రుల స్థానం మాత్రమే గొప్పది.. ప్రతీ తల్లిదండ్రులు గొప్పవారు కాదు. మంచివారు అసలే కాదు. వాళ్లు కేవలం మనుషులు. తమ అవసరం కోసం ఏమైనా చేయగలిగే మృగాలు కూడా! అలాంటి ఓ వ్యక్తి కథే ఇది. మొదటి భార్యతో విభేదాలు రావడంతో ఆమెతో విడిపోయాడు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. దీంతో.. కోర్టు కూతురును తల్లికి, రెండు సంవత్సరాల కొడుకును తండ్రికి అప్పగించింది.
వెంటనే రెండో పెళ్లి చేసుకున్నాడు. మరి, వచ్చిన భార్య మొదటి భార్య కొడుకును ఎందుకు దగ్గరికి తీసుకుటుంది? ఇదేం సినిమా కాదుగదా.. అందుకే 'వాణ్ని నువ్వు దగ్గరికి తీసుకుంటే.. నేను నీ దగ్గరికి రాను' అంటూ కండీషన్ పెట్టింది. దీంతో.. కొడును వృద్ధులైన తన తల్లిదండ్రుల దగ్గర పెంచుతున్నాడు.
అయితే.. భవిష్యత్ లో కూడా కొడుకు అడ్డంకి అని భావించాడేమో.. అడ్డు తొలగించుకోవాలని డిసైడ్ అయ్యాడు. ఎవరిని పట్టుకున్నాడో తెలియదు.. కొడుకును అమ్మేయడానికి బేరం కుదుర్చుకున్నాడు. రూ.18 లక్షలకు కొడుకును అమ్మడానికి ఒప్పందం చేసుకున్నాడు. తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లి, కన్న తల్లి చూడాలని కోరిందంటూ.. బాబును తీసుకొచ్చి అప్పగించాడు. ఆ డబ్బుతో రెండో పెళ్లాంతో హనీమూన్ వెళ్లాడు.
బిడ్డ ఎక్కడ్రా అని తల్లిదండ్రులు అడిగితే ఏవేవో చెప్పాడు. కన్నతల్లికి ఫోన్ చేస్తే అసలు తీసుకురాలేదని చెప్పింది. విషయం పోలీసులకు చేరింది. అతగాడు జైలు గదికి చేరాడు. ఇదంతా పొరుగు దేశం చైనాలో చోటు చేసుకుంది.