ఒబామా సర్టిఫికెట్ తో వార్ వన్ సైడ్ అవుతుందా?

Update: 2015-04-14 04:54 GMT
2016లో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు తాను సిద్దంగా ఉన్నట్లు అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ భార్య హిల్లరీ క్లింటన్ అధికారికంగా ప్రకటించారు. 2008 లో డెమోక్రటిక్ పార్టీ తరపున అభ్యర్థిత్వానికి హిల్లరి క్లింటన్ ప్రయత్నించినా కాని ఆ పార్టీ తరపున అభ్యర్థిత్వం పొందేందుకు జరిగిన ప్రైమరీ లో ప్రస్తుత అధ్యక్షుడు ఒబామా చేతిలో ఓడిపోయి ఆశించిన అధ్యక్ష్ పదవిని అందుకోలేక పోయింది. అయినా కూడా హిల్లరీ కీ ఒబామా తన మంత్రివర్గం లో విదేశాంగ మంత్రిగా చోటిచ్చాడు. కానీ... ఈ సారి మాత్రం ఎలాగైనా పదవిలోకి రావాలని ఆశపడుతున్న హిల్లరి క్లింటన్ అపుడే తన ప్రయత్నాలు మొదలు పెట్టింది.

అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దపడిన హిల్లరీకి... ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు బరక్ ఒబామా సర్టిఫికెట్ ఇస్తున్నారు. హిల్లరీ క్లింటన్ అత్యంత శక్తివంతమైన అధ్యక్షురాలు కాగలదని, మంత్రిగా పనిచేసినప్పుడు ఆమె సామర్థ్యం, సమర్థత చూసానని ఒబామా తెలిపారు. ఇంకే ముంది... హిల్లరీ గెలుపుపై చాలా వరకూ ఒక నిర్ణయానికి వచ్చేస్తున్నారు అమెరికన్స్. కాకపోతే... అమెరికన్లను ఏ ఒక్కరి మాటలో, ఏ ఒక్కరి మద్దతో ప్రభావితం చేయలేదు కాబట్టి... ఫలితం తేలేవరకూ ఎదురుచూడక తప్పదు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సమయంలో హిల్లరీ పై పోటిచేయడానికి రిపబ్లికన్ పార్టీ తరపున రాండ్ పాల్ బరిలోకి దిగుతున్నాడు. ఈ ఎన్నికల్లో హిల్లరీ గెలుపొందుతే... అమెరిక అధ్యక్ష పదవిని చేప్పట్టిన మొదటి మహిళగా ఆమె రికార్డ్ సృస్టిస్తారు.
Tags:    

Similar News