అమరావతి రైతుల అరెస్ట్ పై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
అమరావతి రాజధాని రైతుల పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది. చంద్రబాబును నమ్మి భూములిస్తే ఆయన ఐదేళ్లలో రాజధాని నిర్మించలేకపోయాడు. ఆ వ్యయభారంతో జగన్ సర్కార్ వచ్చాక రెడిమేడ్ నగరం విశాఖకు రాజధాని మారుస్తున్నారు. ఈ క్రమంలోనే పోరుబాట పట్టిన అమరావతి రైతులపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయి.
చాలా మంది రైతులు హైకోర్టుకు ఎక్కగా వారికి అనుకూలంగా తాజాగా తీర్పు వచ్చింది. ఏపీ రాజధాని అమరావతి ప్రాంతానికి చెందిన రైతులపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసు నమోదు చేసి జైలుకు పంపడం అక్రమ నిర్బంధమేనని హైకోర్టు తెలిపింది. ఇది ప్రాథమిక హక్కుల ఉల్లంఘనేని పేర్కొన్న కోర్టు దీన్ని కోర్టు ధిక్కరణగా పరిగణించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది.
తగిన కారణాలు లేకుండా 18 రోజుల పాటు రైతులను అక్రమంగా నిర్బంధించారని.. ఇది రైతుల వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించినదిగా కోర్టు పేర్కొంది.
దీనిపై క్లారిటీ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.