పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్ పై హైకోర్టు విచారణ

Update: 2021-01-28 09:46 GMT
పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేయాలంటూ ఏపీ హైకోర్టులో పిటీషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు శుక్రవారానికి వీటిని వాయిదా వేసింది. గురువారం విచారించిన హైకోర్టు ఏపీలో నోటిఫికేషన్ విడుదలై ఎన్నికల ప్రక్రియ జరుగుతుండగా ఈ సమయంలో తాము జోక్యం చేసుకోవడానికి అవకాశం ఉందా? అని ఏజీని ప్రశ్నించింది.  

పంచాయితీ ఎన్నికలను 2019 ఓటరు జాబితాతో నిర్వహించడంపై అభ్యంతరం తెలుపుతూ యువ ఓటర్లు ఓటుహక్కు కోల్పోయారని.. 3 లక్షలకు పైగా ఓటర్లు ఓటు వేయలేకపోతున్నారని గుంటూరుకు చెందిన అఖిల హైకోర్టులో పిటీషన్ వేసింది. ఈ పిటీషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ఎన్నికల షెడ్యూల్ పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది.

ఈ పిటీషన్ పై తాము డివిజన్ బెంచ్ కు వెళ్తామని పిటీషనర్ తరుఫు న్యాయవాది కోరారు. పిటీషన్ ను డిస్మిస్ చేయాలని కోరారు. దీంతో ఈ పిటీషన్ పై విచారణను హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది.ఎన్నికల సమయంలో హైకోర్టు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని.. కేంద్ర న్యాయవాది, అడ్వకేట్ జనరల్ సూచించడంతో హైకోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది. స్టే ఇవ్వలేదు.
Tags:    

Similar News