• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు...

ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం...పద్ధతి మార్చుకోవాలంటూ హితబోధ !

By - Tupaki Desk
Update: 2021-05-06 11:30 GMT
ఏపీలో రోజురోజుకి కరోనా వైరస్ విజృంభణ పెరిగిపోతున్న తరుణంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతోందని ఘాటు వ్యాఖ్యలు చేసింది. అఫిడవిట్ లో దాఖలు చేసిన దానికి.. క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్న విధానావకు పొంతనలేదని ధర్మాసనం అభిప్రాయపడింది. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేదని గత అఫిడవిట్లో చెప్పినప్పటికీ , వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉందని తెలిపింది. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ బెడ్లు దొరకడం లేదని నోడల్ అధికారులే చెప్పారు అంటూ  ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పద్ధతి మార్చుకోకుంటే సీఎస్ అఫిడవిట్ దాఖలు చేయాల్సి వస్తుందని ధర్మాసనం స్పష్టం చేసింది.

రాష్ట్రంలో కరోనాకు సరైన చికిత్సలు అందడం లేదంటూ సామాజిక కార్యకర్త తోట సురేష్ బాబు, ఏపీసీఎల్ఏ వేసిన పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. కరోనా మహమ్మారి కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రభుత్వం తరపున న్యాయవాది కోర్టు వివరించారు. అదే సమయంలో వాస్తవ పరిస్థితిని అమికస్ క్యూరీ కోర్టుకు వెల్లడించారు.  ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా చికిత్స అందించేందుకు మెరుగైన చికిత్స అందిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. హోం ఐసోలేషన్ లో  ఉన్నవారికి 104, 1902 ద్వారా అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తోంది. అయితే , ఆక్సిజన్ లభ్యత విషయంలో మాత్రం కాస్త గందరగోళం నెలకొన్నట్లు తెలుస్తోంది. పలుజిల్లాల్లో కొవిడ్ పేషెంట్లు ఆక్సిజన్ అందక మృతి చెందినట్లు వస్తున్నవార్తలు కలకలం సృష్టిస్తున్నాయి. నోడల్ అధికారులు 24 గంటలూ అందుబాటులో ఉండాలని, ఎక్కువ పరీక్షలు చేసేలా సౌకర్యాలు కూడా పెంచాలని కోరింది. ఇక వ్యాక్సినేషన్‌పై కూడా హైకోర్టు ఆరా తీసింది. 45 ఏళ్ల లోపున్న వారికి వ్యాక్సిన్ ఎప్పుడు వేస్తారని హైకోర్టు ప్రశ్నించింది.

ఇదిలా ఉంటే రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. తాజా 22,204 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 12,06,232 చేరింది. వీరిలో ఇప్పటివరకు 10,27,720 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,70,588కి పెరిగింది. రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 8,374 కి చేరింది.
Tags:    
  • ap high court 
  • Andhra Pradesh 
  • covi 19 
  • corona cases 
  • lockdown 

Similar News

దాదాపు 50 ఏళ్లుగా అంతరిక్షంలో ప్రయాణం.. వాయేజర్-1లో భూమి నుంచి పంపిన ఓ అరుదైన సందేశం!

2026-11-20 04:37 GMT

హైదరాబాద్‌లో పోడ్ కార్లు.. ఐటీ ఉద్యోగుల ప్రయాణ కష్టాలు తగ్గుతాయా?

2026-11-20 04:15 GMT

జడ్పీ పీఠాలు : టీడీపీకి 22, జనసేనకు 4, బీజేపీకి 1

2026-11-20 03:36 GMT

యూత్ కి బీపీ షుగర్...ఏంటీ జనరేషన్ !

2026-11-20 03:36 GMT

బీఆర్ఎస్ కి రాజకీయ సిద్ధి...అక్కడే రేవంత్ గురి !

2026-11-20 03:35 GMT

పిచ్చికుక్క కరిచిందా.. ఎర్రగడ్డకు పంపిస్తాం.. కోమటిరెడ్డికి రేవంత్ రెడ్డి పరోక్ష పంచ్.. కాంగ్రెస్‌లో మాటల మంటలు

2026-11-19 21:30 GMT

విశాఖ నుంచి తిరుపతి వెళ్ళే భక్తులకు సూపర్ న్యూస్

2026-11-19 21:15 GMT

సీనియర్లను రంగంలోకి దించిన జనసేన

2026-11-19 21:15 GMT

ఎవరు గెలిచినా మేమే...వైసీపీ అలా తృప్తి పడుతోందా ?

2026-11-19 21:12 GMT

మంత్ర్రుల‌ను కాద‌న‌లేరు.. కార్య‌క‌ర్త‌ల‌ను వ‌ద్ద‌న‌లేరు: బాబుకు చిక్కులు

2026-11-19 21:12 GMT

పెరిగే సీట్లు వైసీపీ రాజకీయాన్ని ముంచేస్తాయా ?

2026-11-19 21:11 GMT

మలేషియా గేట్లు మూసేసింది.. భారతీయులకు ఇక వీసా కష్టాలు.. అసలు కారణమిదే..

2026-11-19 21:10 GMT

Copyright @2026

Powered by Blink CMS