లోకేశ్ కు శివాజీ సవాల్

Update: 2016-08-19 07:02 GMT
ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదంటున్న అందరికీ శివాజీ పిండాలు పెట్టారు. గురువారం ఆయన పున్నమి వీఐపీ ఘాట్లో పుష్కర స్నానం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్యాకేజీ కోసం ఆశపడుతున్న నేతలకు ఇదే సరైన పనని ఆయన అన్నారు.  హోదా కోసం కాకుండా ప్యాకేజీ కోసం ప్రయత్నిస్తున్న నేతలు ఇప్పటికైనా తమ తీరు మార్చుకోవాలని ఆయన సూచించారు. లేనిపక్షంలో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని తెలిపారు.

కేంద్రం ఇచ్చిన హామీ మేరకు ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనని శివాజీ అన్నారు. లేనిపక్షంలో ఉద్యమం తప్పదని ఆయన హెచ్చరించారు. తమ ఉద్యమం కేంద్రం వరకు వెళ్తుందని ఆయన హెచ్చరించారు. అదే సమయంలో ఆయన టీడీపీ యువనేత లోకేశ్ కు సవాల్ విసిరారు. ఏపీ అభివృద్ధిపై తనతో చర్చకు రావాలని పిలిచారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో చేశామని చెబుతున్న అభివృద్ధి ఏమిటో ప్రజలకు వివరించాలని ఆయన డిమాండు చేశారు.  లోకేశ్ ఇంతకుముందు ఏపీ ప్రగతిపై చర్చకు రావాలంటూ విపక్షాలను పిలిచారని.. అందుకు స్పందనగానే ఈ సవాల్ విసురుతున్నానని... చర్చకు తాను సిద్ధమేనని శివాజీ ప్రకటించారు.

ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తప్ప న్యాయం జరగదని శివాజీ అన్నారు. ప్రత్యేక ప్యాకేజీ అనేది కేవలం తాత్కాలిక ఉపశమనమే తప్ప దాని వల్ల ప్రయోజనమేమీ ఉండదని శివాజీ అంటున్నారు.  నటుడిగా తెరమరుగైన శివాజీ కొన్నాళ్లుగా ప్రత్యేక హోదాపై తరచూ గళం వినిపిస్తున్నారు. బీజేపీలో చేరిన ఆయన ఇప్పుడు అదే బీజేపీ ప్రభుత్వంపై ప్రత్యేక హోదా విషయంలో మండిపడుతున్నారు. అయితే.. బీజేపీ మాత్రం ఆయనతో తమ పార్టీకి సంబంధాల్లేవని ఇంతకుముందే తెగేసి చెప్పడం విశేషం.
Tags:    

Similar News