ముంబయి అనుభవం గుర్తు చేసి మరీ ఆయన్ను కేసీఆర్ అలెర్టు చేశారట
ఓవైపు భారీ వర్షాలు.. మరోవైపు పోటెత్తిన వరదతో హైదరాబాద్ మహానగరం అతలాకుతలమైంది. దీంతో గ్రేటర్.. దాని చుట్టుపక్కల ప్రాంతాల్లోని వారంతా తీవ్ర ఇబ్బందులకు.. ఇక్కట్లకు గురయ్యారు. ఇలాంటివేళ.. సీఎం కేసీఆర్ చప్పుడు చేయకుండా ఉండిపోయినట్లుగా కొందరు విమర్శలు చేశారు. అయితే.. సీఎం కేసీఆర్ ఏమీ పట్టనట్లుగా ఉండలేదన్న విషయాన్ని సీనియర్ అధికారి నోటి మాటతో అప్రయత్నగా బయటకు వచ్చింది.
భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ నగరంలోని చాలా చోట్ల విద్యుత్ లేని పరిస్థితి. దీనికి కారణం.. సీఎం కేసీఆర్ ఇచ్చిన సలహానే అని చెబుతున్నారు. భారీ వర్షంతో పోటెత్తుతున్న వరద నీటితో.. హైదరాబాద్ నగరంలోఏ ప్రాంతం ఎలా ఉందో చెప్పలేని పరిస్థితి. దీంతో.. మంగళవారం రాత్రి హైదరాబాద్ లోని చాలాచోట్ల విద్యుత్ సరఫరాను తామే ముందస్తు జాగ్రత్తలో భాగంగా ఆపేసినట్లుగా ట్రాన్స్ కో జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు పేర్కొన్నారు.
కాలనీలకు.. అపార్ట్ మెంట్ల సెల్లార్లలోకి వరద నీరు పోటెత్తటంతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని.. గ్రిడ్ కు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. వర్షాల వేళ.. సీఎం కేసీఆర్ తమను అలెర్టు చేశారని.. ముంబయి మహానగరంలో గ్రిడ్ ఫెయిల్ అయిన ఉదంతాన్ని గుర్తు చేసి.. అలాంటిదేమీ చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పినట్లు పేర్కొన్నారు. నిజానికి ఇప్పటి సీజన్ లో 12 వేల మెగావాట్లుగా ఉండాలి. అనూహ్య వర్షాల కారణంగా బుధవారం విద్యుత్ డిమాండ్ 4184 మెగావాట్లుగా నమోదైనట్లు చెప్పారు.
మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు లోడ్ డిస్పాచ్ సెంటర్ ను పర్యవేక్షించామని.. పరిస్థితి ఎక్కడా దారి తప్పకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు చెప్పారు. దీనికి తగ్గట్లే.. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేసిన విద్యుత్ అధికారులు.. మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత తగ్గిన వర్ష తీవ్రత తర్వాత అర్థరాత్రి వేళలోనే విద్యుత్ ను పలు ప్రాంతాల్లో పునరుద్ధరించారు. ఇక.. భారీ ఎత్తున వరద పోటుకు గురైన ప్రాంతాల్లో మాత్రం బుధవారం రాత్రికి కూడా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించని పరిస్థితి. మంగళవారం కురిసిన భారీ వర్షాల కారణంగా విద్యుత్ డిమాండ్ అనూహ్యంగా 2660 మెగావాట్లకు పడిపోవటమే కాదు.. గ్రిడ్ కు ఏమైనా అవుతుందా? అన్న సందేహం కలిగింది.అయితే.. సీఎం కేసీఆర్ అలెర్టు చేయటంతో విద్యుత్ అధికారులు గ్రిడ్ ఫెయిల్ కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.