శృంగారంపై ఆసక్తి లేదా? ఈ వేసవి పండు తినండి

Update: 2020-04-15 21:30 GMT
మామిడి మార్కెట్ ను ముంచెత్తుతోంది. అందరూ సీజనల్ గా దొరికే ఈ పండుకోసం ఎదు రు చూస్తున్నారు. మామిడి ఈ సీజన్ లోనే దొరుకుతుండడం.. ధరలు కూడా దిగిరావడంతో అందరూ కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మరి మామిడి వల్ల ఉపయోగాలెన్నో తెలుసుకుందామా.?

1. మామిడి పండులో శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచే బిటాకెరోటిన్ అనే పదార్థం సంవృద్ధిగా ఉంది. ఇది మన శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచి శరీరాన్ని బలోపేతం చేస్తుంది.

2. మామిడి పండును తినడం వల్ల పంటినొప్పి, చిగుళ్ల సమస్యలు, చిగుళ్ల నుంచి రక్తం కారడం వంటి సమస్యలు దూరమవుతాయి..నోటిలోని బ్యాక్టీరియా నశిస్తుంది. దంతాలు శుభ్రపడతాయి. పంటిపై ఎనామిల్ కూడా దృఢంగా ఉంటుంది.

3. మామిడి పండు మంచి జీర్ణకారి. ఇది అజీర్ణం మరియు అరుగుదల సరిగా లేకపోవడం వంటి జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది.  మామిడి పండ్లను తీసుకోవడం ద్వారా సన్నగా ఉన్నవారు సహజమైన బరువు పెరిగే అవకాశం ఉంది.

4. మామిడిలో ఐరన్ సంవృద్ధిగా లభిస్తుంది. అందువల్ల రక్తహీనతతో బాధపడుతున్న వారు మామిడిపండ్లను తీసుకోవడం ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఇందులో ఉండే కాపర్ ఎర్రరక్తకణాల వృద్ధికి దోహదపడుతుంది.

5. ఈ పండులో ఉండే విటమిన్లు, ఖనిజాలు గుండె జబ్బులు రాకుండా కాపాడుతాయి. వృద్ధాప్య సమస్యలను తగ్గిస్తుంది. చర్మపు ఆరోగ్యాన్ని పెంచుతుంది. మెదడుని ఆరోగ్యంగా ఉంచుతుంది. శృంగారంలో ఆసక్తి లేనివారికి శృంగార వాంఛను కలిగిస్తుంది.

6.    మామిడి పండు పండ్లలో రారాజు.. ఇందులో పోటాషియం మరియు మెగ్నీషియం అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. విటమిన్ సి , ఫైబర్ శరీరంలో హాని చేసే కొలస్ట్రాల్ ని తగ్గిస్తాయి.
Tags:    

Similar News