మరో రెండున్నరేళ్లు ఆయనే సీఎం!

Update: 2021-01-01 07:55 GMT
75 ఏళ్లు దాటడం.. అవినీతి ఆరోపణలు చుట్టముట్టడంతో కర్ణాటక సీఎం పోస్టు నుంచి యడ్యూరప్పను బీజేపీ అధిష్టానం మార్చబోతోందన్న ప్రచారం బాగా జరిగింది. బీజేపీ రాజ్యాంగం ప్రకారం.. 75 ఏళ్లు దాటితే వారిని రాజకీయ పదవుల్లోంచి దించేస్తారు.

అయితే ఈ ప్రచారం నడుమ.. వచ్చే రెండున్నరేళ్లూ నేను ముఖ్యమంత్రిగా కొనసాగుతానని.. కర్ణాటక రాష్ట్రంలో నాయకత్వ మార్పు ప్రశ్నే లేదని కర్ణాటక సీఎం బీఎస్ యడ్యూరప్పా స్పష్టం చేశాడు. ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదని బెంగళూరులో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్నారు.

తన నాయకత్వం విషయంలో రాష్ట్ర పార్టీలోనూ.. అధిష్టానానికి ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవని సీఎం యడ్డీ క్లారిటీ ఇచ్చారు. కరోనా కష్టకాలంలో సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నానన్నారు. నాయకత్వ మార్పు గురించి కొద్దికాలంగా వినిపిస్తున్న ఊహాగానాలను తాను పట్టించుకోలేదని యడ్యూరప్ప తెలిపారు.

ఇక తనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని.. రాష్ట్ర పరిపాలనను సమర్థంగా.. పారదర్శకంగా ముందుకు నడిపించే శక్తి సామర్థ్యాలు తనకు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.
Tags:    

Similar News