మరణం ఎలా ఉంటుందో చెప్పే వీడియోను చూశారా?

Update: 2021-02-27 23:30 GMT
మరణం ఎలా ఉంటుంది? ఎలా వస్తుంది? మరణం కమ్ముకొచ్చే వేళలో ఎలా ఉంటారు? లాంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పటం అంత తేలికైన విషయంకాదు. కానీ.. ఈ 30 సెకన్ల వీడియోలో అదంతా కంటికి కనిపించటమే కాదు.. జీవితం ఇంత క్షణభంగురమా? అనుకోకుండా ఉండలేం. అప్పటివరకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా.. నిక్షేపంగా ఉండటమే కాదు.. క్రికెట్ మ్యాచ్ ఆడుతున్న ఆ ఆటగాడు చూస్తుండగానే కుప్పకూలిపోవటం.. మరణించటం చూస్తే.. మనసు చేదుగా మారటం ఖాయం. తాజాగా వైరల్ గా మారిన ఈ వీడియో వివరాల్లోకి వెళితే..

మహారాష్ట్ర ఫూణెలోని జున్నార్ మండలంలో క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. వేగంగా పరుగెత్తుకొచ్చిన బౌలర్ బంతిని వేగంగా విసరటం.. బ్యాట్స్ మన్ భారీ షాట్ కోసం ప్రయత్నించి ఫెయిల్ అయ్యాడు. నాన్ స్ట్రైకర్ గా ఉన్న బాబు నలవాడె అనే ఆటగాడు రన్ కోసం ముందుకు వచ్చి వెనక్కి వెళ్లాడు. పక్కనే ఉన్న అంపైర్ తో ఏదో మాట్లాడి మళ్లీ తన స్థానంలో నిలుచున్నాడు.

బౌలర్ బాల్ వేయటానికి సిద్ధమవుతున్న వేళ.. నలవాడే తన బ్యాట్ పట్టుకొని మోకాళ్ల మీద కూర్చున్నాడు. మరు క్షణంలో అలానే వెనక్కి పడిపోయాడు. అతడు పడిన తీరు అనుమానం వచ్చిన అంపైర్ వెంటనే ఆటను ఆపి.. బ్యాట్స్ మెన్ ను పిలిచాడు. వెంటనే సిబ్బందిని పిలిచారు. గ్రౌండ్ లోకి వచ్చిన వారు.. నలవాడే మరణించినట్లుగా తేల్చారు. అప్పటివరకు నిక్షేపంగా ఆడుతున్న మనిషి.. అంత సింఫుల్ గా మరణించిన తీరు షాకింగ్ గా మారింది.


Full View
Tags:    

Similar News