• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  జీవో వార్త కూడా టీడీపీ...

జీవో వార్త కూడా టీడీపీ ఎమ్మెల్యే చెబితేనే రాయాలట!

| వ్యతిరేక వార్త రావటం కానీ.. ఇమేజ్ డ్యామేజ్ వార్త రాస్తే ప్రజాప్రతినిధులకు.. రాజకీయ నేతలకు కోపం రావటం ఇప్పటివరకు చూశాం.

By - Tupaki Desk
Update: 2026-03-28 06:47 GMT

వ్యతిరేక వార్త రావటం కానీ.. ఇమేజ్ డ్యామేజ్ వార్త రాస్తే ప్రజాప్రతినిధులకు.. రాజకీయ నేతలకు కోపం రావటం ఇప్పటివరకు చూశాం. అందుకు భిన్నంగా.. అధికారికంగా వెల్లడైన జీవోలోని అంశాలతో వార్త రాసినందుకు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయటమే కాదు..వెధవ వేషాలు వేస్తావా? అంటూ తిట్ట పురాణం అందుకోవటమే కాదు.. తాను చెప్పినప్పుడు మాత్రమే వార్త రాయాలే తప్పించి.. నీ సొంతానికి సొంతంగా వార్త రాస్తావా? అంటూ విరుచుకుపడిన షాకింగ్ ఉదంతం ఏపీలో చోటు చేసుకుంది. ఏపీలోని అధికారపక్షమైన కూటమిలో టీడీపీకి చెందిన ఎమ్మెల్యే మామిడి గోవిందరావు బూతుపురాణం ఇప్పుడు సంచలనంగా మారింది.

ఒక ప్రముఖ మీడియా ప్రతినిధితో సదరు ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయటమే కాదు.. నోటికి వచ్చినట్లుగా తిట్టిన వైనంపై విస్మయం వ్యక్తమవుతోంది. ఏపీ అధికారపక్షానికి దన్నుగా ఉంటుందన్న పేరున్న మీడియా సంస్థకు చెందిన ప్రతినిధి పట్ల ఈ విధంగా వ్యవహరించటం చూస్తే.. ఏంది చంద్రబాబు అని అనుకోకుండా ఉండలేని పరిస్థితి. ఇంతకూ సదరు వార్త కారణంగా ఎమ్మెల్యేకు జరిగే నష్టం కూడా ఏమీ లేకపోవటం విశేషం. ఇంతకూ అసలేం జరిగిందన్నది చూస్తే.. ఇలా కూడా తిట్టేస్తారా? అన్న సందేహం కలుగుతుంది.

శ్రీకాకుళం జిల్లా పిండ్రువాడకు చెందిన శిమ్మయ్య అనే వ్యక్తి గత ఏడాది అక్టోబరు 10న పిడుగుపాటుకు గురై మరణించాడు. జిల్లా కలెక్టర్ పంపిన ప్రతిపాదనల నేపథ్యంలో శిమ్మయ్య కుటుంబానికి రూ.4 లక్షల నష్టపరిహారాన్ని మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ గురువారం అధికారిక ఉత్తర్వు జారీ చేశారు. ఇదే అంశాన్ని ప్రభుత్వం జీవోఐఆర్ వెబ్ సైట్ లోనూ ఉంచింది.

దీని ఆధారంగా వార్త రాసిన సదరు విలేకరిపై ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఇష్టారాజ్యంగా తిట్టేశారు. తాను చెప్పకుండానే జీవో వివరాలతో వార్త ఎలా రాస్తావు? అంటూ చెలరేగిపోయిన ఆయన.. నువ్వేం రాస్తావో చూసుకుందాం. నిన్ను వదలనంటూ విరుచుకుపడటమేకాదు.. ‘‘నేను తిరగబడకూడదని ఊరుకుంటున్నాం. డబ్బులు కావాలంటే కుక్కలకు వేసినట్లు వేస్తాం. ఇలా రాస్తే నా పని నేను చేస్తా’’ అంటూ విరుచుకుపడ్డారు. ప్రభుత్వం జీవోలు పెట్టిన తర్వాత రాయటమన్నది రెగ్యులర్ గా జరిగే ప్రక్రియగా చెప్పినా.. తాను చెబితేనే రాయాలన్న ధోరణి చూస్తే.. ఇలా కూడా మొదలెట్టేశారా? అన్న సందేహం మనసుకు రాక మానదు. ఏమైనా.. ఈ ఉదంతం షాకింగ్ గా మారింది.మరి..దీనిపై సీఎం చంద్రబాబు ఎలా స్పందిస్తారు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

Tags:    
  • andhrapradesh 
  • tdp 
  • mamidigovindarao 
  • politics 

Similar News

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

కష్టజీవులకు భరోసా.. నిర్మాణ రంగానికి ఊతం : ఏపీలో ‘లేబర్ అడ్డా’ల విప్లవం!

2026-11-19 08:05 GMT

రూ.7 కోట్ల ఉద్యోగాల స్కాం : కుట్ర జరిగిందంటున్న జనసేన నేతలు.. అసలు నిజం ఇదే!

2026-11-19 08:02 GMT

ఆకాశంలో అంబానీ 'సిగ్నల్'.. మస్క్‌కు ఇక టెన్షన్ షురూ.. ఇప్పుడు స్పేస్‌లో శాటిలైట్ల జాతర

2026-11-19 06:00 GMT

వాన్స్‌కు షాక్ ఇవ్వనున్న ట్రంప్.. 2028 రేసులో రూబియో పేరు!

2026-11-19 05:37 GMT

ఛాతీ ఎముక కోయకుండానే బైపాస్ సర్జరీ.. భారతీయ రోబోతో అరుదైన ఆపరేషన్!

2026-11-19 05:32 GMT

Copyright @2026

Powered by Blink CMS