'బ్రెయిన్‌కేషన్' తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
బ్రెయిన్‌కేషన్ అనేది కాస్త అటు ఇటుగా మెడిటేషన్ మాదిరిగానే ఉంటుంది. ఏ పని చేయకుండా బ్రెయిన్ కి విశ్రాంతిని ఇవ్వడమే బ్రెయిన్‌కేషన్ అంటారు.;
రోజువారీ జీవితంలో మనిషి మానసికంగా ఎంతగా అలసి పోతున్నాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శారీరకంగా అలసి పోతున్న వారితో పోల్చితే మానసికంగా అలసి పోతున్న వారిలో ఎక్కువగా అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని ప్రయోగాలు తేల్చాయి. అందుకే మానసిక ప్రశాంతత తప్పనిసరి అని నిపుణులు చెబుతున్నారు. రోజువారీ జీవితంలో మానసిక ప్రశాంతత కనీసం కొన్ని నిమిషాలు అయినా ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ మధ్య కాలంలో కొత్తగా బ్రెయిన్‌కేషన్ అనే పద్దతి ప్రాచుర్యంలోకి వచ్చింది. సోషల్ మీడియాలో ఈ విధానం గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది. గంటల తరబడి కంటిన్యూగా వర్క్ చేసే వారికి, ముఖ్యంగా ఐటీ జాబ్స్ చేసే వారికి బ్రెయిన్‌కేషన్ అనేది అత్యంత ఉపయోగదాయకం అనేది నిపుణుల అభిప్రాయం. బ్రెయిన్‌కేషన్ అనేది కాస్త అటు ఇటుగా మెడిటేషన్ మాదిరిగానే ఉంటుంది. ఏ పని చేయకుండా బ్రెయిన్ కి విశ్రాంతిని ఇవ్వడమే బ్రెయిన్‌కేషన్ అంటారు.
బ్రెయిన్‌కేషన్‌తో అన్ని విధాలుగా ప్రయోజనం...
ఎంత బిజీగా ఉన్నప్పటికీ రోజులో కొంత సమయం పని ఒత్తిడి నుంచి దూరంగా ఉండాలి. ఆ సమయంలో ఎలాంటి ఆలోచనలు లేకుండా బ్రెయిన్‌ను ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఆ సమయంలో ఫోన్‌లకు దూరంగా ఉండాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా మనసుకు ఏది తోస్తే అది చేస్తూ దూరంగా ఉన్న వస్తువులను చూస్తూ కింద ఇష్టమైన యాంగిల్‌లో కూర్చుని విశ్రాంతి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి అనేది నిపుణులు చెబుతున్న మాట. రోజులో కనీసం నాలుగు నుంచి అయిదు సార్లు అయినా బ్రెయిన్‌కేషన్ చేయాలి. అయిదు నుంచి పది నిమిషాలు బ్రెయిన్‌కేషన్ చేసినట్లయితే అద్భుతాలు ఆవిష్కారం అవుతాయి అనేది కొందరి మాట. మొత్తానికి బ్రెయిన్‌కేషన్ అనే ఈ కొత్త ట్రెండ్ ను ఎక్కువగా ఐటీ నిపుణులు, పని ఒత్తిడి ఉండే వారు చేస్తే బాగుంటుంది. నిపుణులు చెబుతున్న దాని ప్రకారం ఆయుశ్శు కూడా దీంతో పెరుగుతుందట.
క్రియేటివిటీ పెరుగుదల...
బ్రెయిన్‌కేషన్ వల్ల ప్రయోజనాలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం... నింతరం ఆలోచనలు, పని ఒత్తిడి కారనంగా బ్రెయిన్ స్ట్రెయిన్ అవుతుంది. అలాంటప్పుడు బ్రెయిన్‌కేషన్ చేయడం వల్ల ఒత్తిడి హర్మోన్ అయిన కార్టిసాల్ స్థాయి తగ్గి ఒత్తిడి తగ్గుతుంది. అంతే కాకుండా రోజులో ఎక్కువ సార్లు బ్రెయిన్‌కేషన్ చేయడం వల్ల క్రియేటివిటీ పెరుగుతుందని నిరూపితం అయ్యింది. బ్రెయిన్ ని కొంత సమయం రెస్ట్ మోడల్ లో ఉంచడం వల్ల డీఫాల్ట్ మోడ్ నెట్ వర్క్ యాక్టివేట్ అయ్యి, కొత్త ఆలోచనలు వచ్చే అవకాశం ఉంటుంది. పెద్ద సమస్యలకు సత్వర పరిష్కారం లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒక పనిని ఎక్కువ సమయం చేయడం ద్వారా ఆసక్తి తగ్గతుంది. అలా కాకుండా కాస్త విరామం తీసుకుని బ్రెయిన్‌కేషన్ చేయడం ద్వారా ఆ పని పై మళ్లీ ఆసక్తి పెరిగి ఏకాగ్రత మరింతగా పెరిగి ఆ పనిని మరింత బాగా, స్పీడ్‌గా చేసే అవకాశాలు మెరుగు పడుతాయి.
మొబైల్స్‌కి దూరంగా...
నిపుణులు చెబుతున్న దాని ప్రకారం బ్రెయిన్‌కేషన్‌తో జ్ఞాపకశక్తి పెరుగుతుంది, ఎమోషనల్‌గా స్ట్రాంగ్‌గా మారుతారు. బ్రెయిన్‌లో ఉన్న స్ట్రెస్ అంతా తగ్గడం వల్ల సహజంగానే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అంతే కాకుండా ఏదైనా నిర్ణయం తీసుకునే సమయంలో ఎమోషనల్‌గా స్ట్రాంగ్‌గా మారుతారు. అందుకే బ్రెయిన్‌కేషన్ అనేది తప్పనిసరిగా చేయాలంటూ నిపుణులు చెబుతున్నారు. బ్రెయిన్‌కేషన్ లో ప్రధానంగా మొబైల్ ను దూరంగా పెట్టాలి, ఆ మొబైల్ ను పూర్తిగా సైలెంట్ మోడ్‌లో పెట్టి, అటు వైపు దృష్టి పెట్టకుండా ఉండాలి. కళ్లు మూసుకుని చుట్టూ వినిపిస్తున్న శబ్దాలపై కాకుండా శ్వాస పీల్చుకున్నప్పుడు వచ్చే శబ్దం ను పరిశీలిస్తూ ఉండాలి. రోజులో ఒక్కసారి అయినా అయిదు నుంచి పది నిమిషాలు బ్రెయిన్‌కేషన్ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి అనేది ప్రయోగాల ద్వారా వెల్లడి అయిందని నిపుణులు చెబుతున్నారు.