• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Health >  నైట్ డ్యూటీలు గుండె...

నైట్ డ్యూటీలు గుండె ఆకారంలో మార్పులు తెస్తాయా? స్టడీ ఏం చెబుతోందంటే?

| నైట్‌ షిఫ్టుల్లో పనిచేసే ఉద్యోగుల గుండె నిర్మాణంలో మార్పులు వస్తున్నట్లు చైనా అధ్యయనం వెల్లడించింది. 42,671 మందిపై నిర్వహించిన పరిశోధనలో వారి గుండె గోడలు కొద్దిగా మందంగా, గదులు చిన్నవిగా ఉన్నట్లు గుర్తించారు. అయితే రక్తాన్ని పంపే సామర్థ్యంలో పెద్దగా మార్పులు కనిపించలేదని పరిశోధకులు తెలిపారు. సరైన నిద్ర, వ్యాయామం, ఆహారం గుండె ఆరోగ్యానికి కీలకమని సూచించారు.

By - Madhu Reddy
Update: 2026-11-28 05:22 GMT

ఉరుకుల పరుగుల జీవితంలో సంపాదనకి ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇస్తున్నారు కానీ ఆరోగ్యాన్ని పక్కన పెడుతున్నారనే మాట ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటుంది. అంతెందుకు మన వరకు తీసుకుంటే మనం కూడా వాళ్ళు5 సంపాదిస్తున్నారు.. వీళ్ళు సంపాదిస్తున్నారు అని ఆరాటపడుతున్నామే తప్ప మన ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించడం లేదు. ఇది నమ్మదగిన సత్యం. ప్రతిరోజు మనకంటూ 10 నిమిషాలు లేదా అరగంట కేటాయించుకోవాలని అనుకుంటున్నా సరైన సమయం లేకపోవడం .. పని ఒత్తిడి వంటి కారణాలవల్ల ఆరోగ్యాన్ని కూడా పక్కన పెడుతున్నాం.

ఇకపోతే ఉద్యోగాలలో డే షిఫ్ట్ , నైట్ షిఫ్టుల కారణంగా ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ముఖ్యంగా నైట్ షిఫ్ట్ కారణంగా నిద్రలేమి, తలనొప్పి తో పాటు మరెన్నో సమస్యలు తలెత్తుతుంటే.. ఇప్పుడు తాజాగా స్టడీ మరో విస్తుపోయే నిజాన్ని బయటపెట్టింది. ఎక్కువగా నైట్ షిఫ్ట్ లలో పనిచేసే ఉద్యోగులలో గుండె ఆకారం కూడా మారుతోందని చెప్పడం అందర్నీ విస్మయానికి గురిచేస్తుంది. ఆరోగ్యంలో మార్పులు రావడం విన్నాము.. కానీ గుండెలో కూడా మార్పులు రావడం ఏంటి? అందులోనూ ఆకారంలో ఎలా మార్పులు వస్తాయి? ఇలా పలు అనుమానాలు ప్రజలలో కూడా తలెత్తుతున్నాయి.. మరి ఆ స్టడీ ఏం చెబుతోంది? గుండె ఆకారంలో వచ్చే మార్పుల వల్ల మనకు ఏదైనా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయా? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం..

తాజాగా చైనా అధ్యయనంలో ఈ విషయం వెళ్లడయ్యింది. నైట్ షిఫ్ట్ లో ప్రత్యేకించి రాత్రివేళలో పనిచేస్తున్న ఉద్యోగులలో గుండె నిర్మాణం, పనితీరులో చిన్న మార్పులు కనిపిస్తున్నాయని ఆ అధ్యయనం వెల్లడించింది. సుమారుగా రాత్రిపూట పనిచేసే 42,671 మంది వ్యక్తుల గుండెను స్కాన్ చేయగా.. ఇందులో విస్తపోయే నిజాలు బయటపడ్డాయి. ముఖ్యంగా నైట్ డ్యూటీ చేసే వారి గుండె గోడలు కొద్దిగా మందంగా.. గదులు చిన్నవిగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. అయితే గుండె రక్తాన్ని పంపే సామర్ధ్యంలో పెద్ద మార్పులు ఏవి లేవని తేల్చారు.

అయితే గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అంటే.. సరైన నిద్ర, వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారంతో గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అని సలహా ఇస్తున్నారు. ఏది ఏమైనా ఇలాంటి సర్వేలు ప్రజలలో మంచి అవగాహన కల్పిస్తున్నాయని చెప్పాలి.

నిజానికి ఉద్యోగం అనేది ప్రతి ఒక్కరికి తప్పనిసరి. అయితే ఆ ఉద్యోగం కారణంగా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి అంటే.. ఉద్యోగం మానేయడం కంటే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడం చాలా ఉత్తమం . అందుకే ఆరోగ్యం మెరుగుపడాలి అంటే మనకంటూ ఒక సమయాన్ని కేటాయించుకోవాలి.. సరైన తిండి, నిద్ర అలవాటు చేసుకుంటే ఎప్పుడు పనిచేసిన మనం ఆరోగ్యంగా ఉండగలం అని నిపుణులు సలహాలు ఇస్తున్నారు.

Tags:    
  • nightshifts 
  • hearthealth 
  • nightshiftworkers 
  • healthstudy 
  • heartdisease 

Similar News

సైలెంట్ కిల్లర్స్‌పై పోరులో గ్రామీణ వైద్య సిబ్బందిదే కీలక పాత్ర!

2026-11-27 06:45 GMT

భార్యాభర్తల మధ్య తరచూ గొడవలా? B12 లోపం ప్రభావం కూడా ఉండొచ్చు!

2026-11-27 02:25 GMT

చిన్నారులకు కడుపునొప్పి వస్తే వాతలా? ప్రాణాలకే ముప్పు తెచ్చే మూఢనమ్మకాలు!

2026-11-26 08:58 GMT

భోగి వెనుక సంపత్ నంది చిన్ననాటి భయం!

2026-11-24 18:18 GMT

చిన్నా పెద్దా ఇష్టపడే ఈ ఫుడ్‌తో గుండెకు ముప్పు!

2026-11-23 05:46 GMT

హెచ్ఐవీలో ఆరు జిల్లాలు సురక్షితం.. మరో పది జిల్లాల్లో కూడా నియంత్రణలోనే పులి రాజా!

2026-11-21 18:46 GMT

కన్నీటి కడలిలో ఆశాకిరణం.. రూ.9 కోట్ల ప్రాణరక్షక మందును రూ.2.5 లక్షలకే తెచ్చిన హైదరాబాద్ వైద్యురాలు

2026-11-21 07:30 GMT

యూత్ కి బీపీ షుగర్...ఏంటీ జనరేషన్ !

2026-11-20 03:36 GMT

ఛాతీ ఎముక కోయకుండానే బైపాస్ సర్జరీ.. భారతీయ రోబోతో అరుదైన ఆపరేషన్!

2026-11-19 05:32 GMT

షాకింగ్ న్యూస్...ఏపీని పీడిస్తున్న రెండు జబ్బులు

2026-11-15 20:52 GMT

ఏపీకి బీపీ, షుగర్ ముప్పు.. కోటి మందికి పైగా బాధితులు! సర్వేలో షాకింగ్ నిజాలు!

2026-11-15 20:26 GMT

Copyright @2026

Powered by Blink CMS