• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Health >  హెచ్ఐవీలో ఆరు జిల్లాలు...

హెచ్ఐవీలో ఆరు జిల్లాలు సురక్షితం.. మరో పది జిల్లాల్లో కూడా నియంత్రణలోనే పులి రాజా!

| ఏపీలో హెచ్‌ఐవీ నియంత్రణ చర్యలు మంచి ఫలితాలిస్తున్నాయి. నాకో తాజా ర్యాంకింగ్స్‌లో రాష్ట్రంలోని 28 జిల్లాలకు గాను 16 జిల్లాలు ఉన్నత హోదాలు సాధించాయి. ఆరు జిల్లాలకు ‘సురక్షిత్‌’, మరో పది జిల్లాలకు ‘సక్షమ్‌’ గుర్తింపు లభించింది. 2030 నాటికి ఎయిడ్స్‌ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.

By - Tupaki Political Desk
Update: 2026-11-21 18:46 GMT

ఏపీలో హెచ్‌ఐవీ (HIV) నియంత్రణ చర్యలు అద్భుత ఫలితాలను ఇస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న జాగ్రత్తలతో వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట పడుతోంది. దీంతో జాతీయ స్థాయిలో ఏపీకి ప్రత్యేక గుర్తింపు దక్కింది. ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ (నాకో - NACO) తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో రాష్ట్రంలోని 28 జిల్లాలకు గాను ఏకంగా 16 జిల్లాలు ఉన్నత హోదాలను సొంతం చేసుకున్నాయి. 2026 అక్టోబరు నాటి పనితీరు ఆధారంగా ఆరు జిల్లాలు పూర్తి స్థాయిలో ‘సురక్షిత్‌’ కేటగిరీలో నిలవగా, మరో పది జిల్లాలు ‘సక్షమ్‌’ హోదాతో వైరస్‌ను సమర్థవంతంగా కట్టడి చేశాయి.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిర్దేశించిన మూడు '95-95-95' లక్ష్యాలను నూరు శాతం చేరుకున్న చిత్తూరు, తూర్పుగోదావరి, గుంటూరు, కాకినాడ, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలకు అత్యున్నతమైన ‘సురక్షిత్‌’ హోదా దక్కింది. అలాగే, ఈ మూడు లక్ష్యాల్లో రెండింటిని విజయవంతంగా పూర్తి చేసిన అనకాపల్లి, అనంతపురం, బాపట్ల, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, ఏలూరు, కర్నూలు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, తిరుపతి, వైఎస్సార్‌ కడప జిల్లాలకు ‘సక్షమ్‌’ గుర్తింపు లభించింది. మిగిలిన 12 జిల్లాలను ‘సంఘర్షశీల’ విభాగంలో చేర్చి, అక్కడ ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. రానున్న వారంలోనే మరో మూడు జిల్లాలను ‘సురక్షిత్‌’ స్థాయికి తీసుకొచ్చేందుకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ (APSACS) దృఢ సంకల్పంతో పనిచేస్తోందని ప్రాజెక్ట్ డైరెక్టర్ స్మరణ్‌ రాజ్‌ వెల్లడించారు.

ఏప్రిల్‌ నుంచి అక్టోబరు 2026 మధ్య రాష్ట్రంలో పరీక్షలు, చికిత్సల తీరు గణనీయంగా మెరుగుపడిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ తెలిపారు. హెచ్‌ఐవీతో జీవిస్తున్న వారిలో తమ వ్యాధి స్థితిని తెలుసుకున్న వారి శాతం ఏప్రిల్‌లో 87.7 శాతంగా ఉండగా, అక్టోబరు నాటికి అది 92.7 శాతానికి (ప్రస్తుతం 92.8 శాతం) పెరిగిందని వివరించారు. ఈ ఆరు నెలల కాలంలో సమగ్ర సలహా, పరీక్షా కేంద్రాల ద్వారా కొత్తగా 7,641 మందికి హెచ్‌ఐవీ ఉన్నట్లు గుర్తించారు. ముఖ్యంగా వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాలు, పరిశ్రమలు, రేవు ప్రాంతాల్లో ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తూ, క్షయ వ్యాధి నిర్మూలన కార్యక్రమంతో సమన్వయం చేసుకుంటూ ముందస్తు గుర్తింపునకు చర్యలు తీసుకుంటున్నారు.

వ్యాధి నిర్ధారణ అయిన వారికి వైరస్‌ నియంత్రణ మందుల చికిత్స (ART) అందించడంలోనూ రాష్ట్రం ముందంజలో ఉంది. చికిత్స పొందుతున్న వారి శాతం 86.3 నుంచి 92.7 శాతానికి ఎగబాకడంతో, బాధితుల సంఖ్య 2,41,507 నుంచి 2,65,690కి చేరింది. వీరిలో ఏకంగా 96.4 శాతం మందిలో వైరస్‌ స్థాయి పూర్తిగా నియంత్రణలో ఉండటం విశేషం. పరీక్షలు, చికిత్స సేవలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ఏపీఎస్‌ఏసీఎస్‌ ప్రత్యేకంగా ‘సురక్ష’ డ్యాష్‌బోర్డును రూపొందించింది. అంతేకాకుండా, మందుల వాడకాన్ని మధ్యలో ఆపేసిన వారిని తిరిగి వైద్య సేవల్లోకి తీసుకొచ్చేందుకు 2026 జులైలో ప్రారంభించిన ‘ఈచ్‌ వన్‌ రీచ్‌ వన్‌’ కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు 3,748 మందికి కౌన్సెలింగ్‌ ఇచ్చి తిరిగి చికిత్స అందిస్తున్నారు. ప్రజల భాగస్వామ్యం, సాంకేతిక పరిజ్ఞానం, జిల్లాల సమన్వయంతో 2030 నాటికి రాష్ట్రాన్ని ఎయిడ్స్‌ ముప్పు లేని ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ స్పష్టం చేశారు.

Tags:    
  • hivcontrol 
  • hivprevention 
  • naco 
  • aidsawareness 
  • satyakumaryadav 

Similar News

కన్నీటి కడలిలో ఆశాకిరణం.. రూ.9 కోట్ల ప్రాణరక్షక మందును రూ.2.5 లక్షలకే తెచ్చిన హైదరాబాద్ వైద్యురాలు

2026-11-21 07:30 GMT

యూత్ కి బీపీ షుగర్...ఏంటీ జనరేషన్ !

2026-11-20 03:36 GMT

ఛాతీ ఎముక కోయకుండానే బైపాస్ సర్జరీ.. భారతీయ రోబోతో అరుదైన ఆపరేషన్!

2026-11-19 05:32 GMT

షాకింగ్ న్యూస్...ఏపీని పీడిస్తున్న రెండు జబ్బులు

2026-11-15 20:52 GMT

ఏపీకి బీపీ, షుగర్ ముప్పు.. కోటి మందికి పైగా బాధితులు! సర్వేలో షాకింగ్ నిజాలు!

2026-11-15 20:26 GMT

క్యాన్సర్ పై పోరులో ముందడుగు.. పర్సనలైజ్డ్ క్యాన్సర్ వాక్సిన్ పై బిగ్ అప్డేట్!

2026-11-15 20:12 GMT

మృత్యువు ఎంత దూరం !

2026-11-15 05:30 GMT

క్యాన్సర్ నుంచి అల్జీమర్స్ వరకు ఏ రోగాలు ఉండవు.. ఏఐతో అన్నీ మటాషేనట..!

2026-11-11 12:15 GMT

కొత్త కోవిడ్ వేరియంట్ PJ.2.1.. మళ్లీ కరోనా భయం అవసరమా?

2026-11-11 11:25 GMT

కార్తీక మాసం అంటే కేవలం భక్తి మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా ఓ ఛాలెంజ్.. తెలుగు యువత కొత్త ట్రెండ్..

2026-11-09 10:56 GMT

సాధారణ ఉప్పుతో గుండెకు ముప్పు.. పొటాషియం ఉప్పుతో లక్షల ప్రాణాలకు రక్షణ!

2026-11-06 05:02 GMT

Copyright @2026

Powered by Blink CMS