పెద్దన్నకు దిమ్మ తిరిగే షాకిస్తున్న ‘హవానా’ రుగ్మత
ప్రపంచానికి పెద్దన్న.. సాంకేతికతతో ఎంతో ముందుండే అగ్రరాజ్యం అమెరికాకు ఇప్పుడో పెద్ద సమస్యతో సతమతం అవుతుంది. ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? ఎలా చేస్తున్నారు? అసలు ఇదెలా సాధ్యమవుతుంది? లాంటి ప్రశ్నలకు మరిన్ని ప్రశ్నలు జత చేరటమే కానీ సమాధానాలు లభించని పరిస్థితి. ఇప్పటికే కరోనా కారణంగా సతమతమవుతున్న అగ్రరాజ్యానికి హవానా రుగ్మత క్రాక్ చేయలేని ఫజిల్ లా మారింది. ఇంతకీ హవానా రుగ్మత ఏమిటి? అదెలా ఉంటుంది? ఎవరెవరిని అటాక్ చేస్తోంది? అగ్రరాజ్యానికి ఆందోళనను కలిగించే దీని స్వభావం ఏమిటి? అన్న వివరాల్లోకి వెళితే..
ఈ మధ్యన అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ వియత్నాం పర్యటన హవానా రుగ్మత కారణంగా కొన్ని గంటలు ఆలస్యమైంది. వియత్నాంలోని హనోయ్ దౌత్య కార్యాలయంలో ఈ రుగ్మత బారిన పడిన ఒక వ్యక్తిని అత్యవసర చికిత్స కోసం తరలించాల్సి వచ్చింది. అంతేకాదు.. వియత్నాంలోని అమెరికా దౌత్య సిబ్బంది ఇళ్ల వద్ద కూడా ఇలాంటి అంతుచిక్కని దాడి జరిగినట్లుగా అనుమానిస్తున్నారు.
ఇంతకీ ఈ రుగ్మత ఏమిటంటే.. దీని బారిన పడిన వారు తమ చుట్టూ కందిరీగల దండు తిరుగుతున్నట్లుగా రొద భరించలేనంతగా ఉంటుంది. వికారం.. తలపోటు.. నిస్సత్తువ.. కళ్లు తిరగటం.. నిద్రలేమి.. వినికిడి లోపం.. మతిమరుపు లాంటి లక్షణాలు వేధిస్తాయి. క్యూబాలో దీని బారిన పడిన వారిలో మూడోవంతు మందికి వినికిడి శక్తి లోపించింది. వారి మెదళ్లు సైతం దెబ్బ తిన్నట్లుగా స్కానింగ్ లో తేలింది.
అది కూడా ప్రమాదాల్లో గాయపడే స్థాయిలో మెదడుకు నష్టం వాటిల్లినట్లుగా గుర్తించారు. ఈ తరహా రుగ్మతకు గురయ్యే వారిలో అధికం క్యూబా.. చైనాల్లోని దౌత్య కార్యాలయాల్లో పని చేసే వారిలోనే బాధితులు అధికంగా ఉన్నట్లు గుర్తించారు. దౌత్యవేత్తలు.. గూఢాచారులు.. సైన్యం.. సీఐఏ సిబ్బంది.. విదేశాంగ శాఖ అధికారులే బాధితులుకావటం అమెరికాకు అంతుచిక్కనిదిగా మారింది. గడిచిన ఐదేళ్లలోపెద్ద ఎత్తున ఈ సమస్య బారిన పడినట్లుగా గుర్తించారు. ఇదే తరహా ఇబ్బందిని జర్మనీ.. ఆస్ట్రేలియా.. తైవాన్.. రష్యాలోనూ ఎదురైనట్లుగా చెబుతున్నారు.
తొలిసారి ఈ రుగ్మత హవానాలో బయటపడటంతో హవానా రుగ్మతగా దీనికి పేరు వచ్చింది. కంప్యూటర్లు.. సెల్ ఫోన్లు లాంటి ఉపకరణాల నుంచి నిఘా సమచారాన్ని సేకరించే క్రమంలో ఇలాంటి దాడులు జరుగుతున్నట్లుగా అనుమానిస్తున్నారు. మైక్రోవేవ్ తరంగాల్ని వాడటం ద్వారా ఇలాంటి పరిస్థితిని తెస్తున్నారన్న మాట వినిపిస్తున్నా.. అందుకు తగ్గ ఆధారాలు బయటకు రాని పరిస్థితి. ఈ రుగ్మత అమెరికాను విపరీతంగా ఇబ్బందికి గురి చేస్తోంది. తాజాగా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకన్ సైతం జూన్ లో పేర్కొనటం గమనార్హం. అయితే.. ఈ ఆరోపణలకు.. శాస్త్రీయ ఆధారాలు ఏమీ లేవని క్యూబా శాస్త్రవేత్తల కమిటీ నివేదిక స్పష్టం చేస్తోంది. అంతుచిక్కనిది ఏదో తమను ఇబ్బందులకు గురి చేస్తుందన్న అమెరికా వాదన ఇప్పుడు కలకలాన్ని రేపుతోంది.మరి.. దీని సంగతి ఎప్పటికి తేలుతుందో చూడాలి.