హత్రాస్’​ ఫోరెన్సిక్​ నివేదిక తప్పుల తడక.. నిపుణుల ఆగ్రహం

Update: 2020-10-06 05:30 GMT
యూపీలోని హాత్రస్​ జిల్లాలో జరిగిన దారుణంపై యావత్​ భారతదేశం అట్టుడుకుతోంది. అయితే అసలు బాధితురాలిపై లైంగికదాడే జరుగలేదని ఫోరెన్సిక్​ నివేదిక తేల్చిచెప్పింది. దీనిపై పలువురు నిపుణులు మండిపడుతున్నారు. ఆ ఫోరెన్సిక్​ నివేదికను రాజకీయ ఒత్తిళ్లతో తారుమారు చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.  ఈ అంశంపై పలు దళితసంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.  ఆగ్రా కు చెందిన ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ(ఎఫ్‌ఎస్‌ఎల్) తుది నివేదిక లో, టెస్టింగ్‌ కు వచ్చిన నమూనాలో స్పెర్మ్ (వీర్యం) కనుగొనలేదు. అంతేకాదు లైంగికదాడి జరిగిందన్న ఆధారాలు కూడా లేవని పేర్కొంది. అయితే ఈ నివేదిక తప్పుల తడక అని నిపుణులు పేర్కొంటున్నారు. బాధితురాలి నమూనాలను ఘటన జరిగిన 11 రోజుల తర్వాత పంపించారని ..  అన్ని రోజుల తర్వాత స్పెర్మ్ నమూనాల్లో రావడం చాలా కష్టమని వారు చెబుతున్నారు. ఈ కేసుపై ప్రభుత్వం, పోలీసులు తీవ్ర నిర్లక్ష్యం వహించారని ఆరోపణ లు వినిపిస్తున్నాయి.

యోగీ ప్రభుత్వం నిందితులకు కొమ్ము కాస్తున్నదన్న విమర్శలు వచ్చాయి.  సెప్టెంబర్ 22న హాథ్రాస్​ ఘటనలో నమూనాలు సేకరించారు.  ల్యాబ్‌కు సెప్టెంబర్ 25న పంపించారు.  ఈ నివేదిక ఆధారంగా పోలీసులు లైంగికదాడి జరగలేదని చెబుతున్నారు. ఈ విషయంపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సెప్టెంబర్ 22 న తీసిన నమూనా, సెప్టెంబర్ 25 ల్యాబ్​కు ఎందుకు పంపించారు.  సెప్టెంబర్ 14 న సామూహిక అత్యాచారానికి గురైన 19 ఏళ్ల దళిత బాలిక గురించి అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం ఆసుపత్రిలో ఇచ్చిన ప్రకటనలో సెప్టెంబర్ 22 న స్పృహ తిరిగి వచ్చిన తరువాత , ఆమె స్టేట్మెంట్ మేజిస్ట్రేట్ ముందు రికార్డ్ చేయబడింది. పోలీసులు అత్యాచారంకు సంబంధించిన కేసుగా ఎఫ్ఐఆర్‌లో చేర్చారు.

బాధితురాలి ప్రకటన తరువాత, ఆమె నమూనా ఎఫ్‌ఎస్‌ఎల్ దర్యాప్తు కోసం ఆగ్రాకు పంపబడింది, అది సెప్టెంబర్ 25న అక్కడకు చేరుకుంది. ఈ నివేదిక ఆధారంగా పోలీసులు అత్యాచారం చేయలేదని చెబుతున్నారు. అదే నివేదికలో, బాధితురాలి నమూనాలో స్పెర్మ్ కనుగొనబడలేదు. ప్రభుత్వ మార్గదర్శకాలు 96 గంటల్లోపు అత్యాచారానికి ఫోరెన్సిక్ ఆధారాలు తీసుకుంటేనే నమూనాల్లో వస్తుంది. కానీ పోలీసులు ఎందుకు తాత్సారం చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.  రెండు లేదా మూడు రోజుల తర్వాత స్పెర్మ్‌లు జీవించవు. 11 రోజుల తర్వాత సేకరిస్తే ఎలా తెలుస్తుందని వైద్య నిపుణులు ప్రశ్నిస్తున్నారు. పోలీసుల తీరు, ప్రభుత్వ వైఖరిపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది. యోగీ ప్రభుత్వం కావాలనే నిందితులకు కొమ్ముకాస్తున్నదన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
Tags:    

Similar News