లైంగిక వేధింపులు: బడా నిర్మాతకు 23 ఏళ్ల జైలు
లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ హాలీవుడ్ నిర్మాత హార్వీ వెయిన్ స్టీన్ కు ఏకంగా 23 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఈ మేరకు న్యూయార్క్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది.
హాలీవుడ్ నిర్మాతగా వెయిన్ స్టీన్ పాపులర్. ఈయన ఎన్నో సినిమాలు నిర్మించారు. అయితే ఈయన హీరోయిన్లు, నటీనటులపై లైంగిక వేధింపులు చేశారనే ఆరోపణలున్నాయి. హార్వీ లైంగిక వేధింపులు చేశాడని దాదాపు 90మంది నటీనటీలు మీటూ ఉద్యమంలో ఆరోపించారు. ఈయన బాధితుల్లో ప్రముఖ హాలీవుడ్ హీరోయిన్లు ఎంజెలినా జోలీ, సాల్మా హయాక్ వంటి ప్రముఖులు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కేసు నమోదై కోర్టులో విచారణ సాగుతోంది.
వెయిన్ స్టీన్ పై వచ్చిన లైంగిక ఆరోపణలు నిజమేనని కోర్టు తేల్చింది. ఈ కేసులో వెయిన్ స్టీన్ కు 23 ఏళ్ల జైలు శిక్షను విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.
అయితే కారు ప్రమాదంలోొ గాయపడి వీల్ చైర్ లో హార్వీ కోర్టు హాజరయ్యారు. ఆయన ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఐదేళ్ల జైలు శిక్ష మాత్రమే విధించాలని ఆయన తరుఫున న్యాయవాదుల బృందం విజ్ఞప్తిని చేసింది. అయితే ఆయన విజ్ఞాపణ ను కోర్టు పరిగణలోకి తీసుకోకుండా ఏకంగా 23 ఏళ్ల జైలు శిక్ష విధించింది.