విటమిన్ బిల్లలు అతిగా మింగేయకండి.. దెబ్బైపోతారు !
ప్రస్తుత సీజన్ లో కరోనా రాకుండా ఉండేందుకు రోగనిరోధక శక్తి పెంచుకోవడం ఒక్కటే మార్గమని వైద్యులు, శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీంతో ఇమ్యూనిటీని పెంచుకొనేందుకు ప్రజలంతా ఇబ్బడిముబ్బడిగా విటమిన్ ట్యాబ్లెట్లు వాడేస్తున్నారు. డాక్టర్ సలహా లేకుండా మెడికల్ షాప్‌కు వెళ్లి మల్టీ విటమన్ ట్యాబ్లెట్లు కొని మింగేస్తున్నారు. ఇలా అతిగా విటమిన్ బిల్లలు వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కరోనా నుంచి రక్షించుకొనేందుకు అంటూ కొత్త రోగాలను అంట గట్టుకోవద్దని సూచిస్తున్నారు. విటమిన్ ట్యాబ్లెట్ల వాడకంపై ఎన్సీబీఐ (నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్) ఏం చెబుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
వైరస్‌లకు భయపడి, కరోనా వస్తుందేమోనని ఆందోళన చెంది అతిగా విటమిన్ ట్యాబ్లెట్లు వాడితే ప్రమాదం. దీని వల్ల శరీరం మనకు తెలియకుండానే ఎన్నో మార్పులకు లోనవుతుంది. ఇప్పడు మనం బాగానే ఉన్నట్టు కనిపించినా భవిష్యత్‌లో ప్రమాదాలు ఎదురవుతాయి. అతిగా విటమిన్ ట్యాబ్లెట్లు మింగినా.. శరీరంలో విటమిన్ల స్థాయి మోతాదుకు మించి ఎక్కువైనా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. విటమిన్ల స్థాయి మించితే కడుపు లో వికారం ఏర్పడుతుంది. గొంతు నొప్పి, అలసటి వంటి సమస్యలు కూడా రావచ్చు.
విటమిన్-ఏ కంటికి మేలు చేస్తుందన్నది తెలిసిన విషయమే. అయితే విటమిన్ ఏ ఎక్కువైతే కూడా కంటికే ప్రమాదం. విటమిన్లను మనం ఆహారం రూపంలోనే తీసుకోవాలే తప్ప.. ట్యాబ్లెట్ల రూపంలో తీసుకోవద్దు. విటమిన్-డీ సూర్యరశ్మి నుంచి సహజంగా లభిస్తుంది. చాలామంది ట్యాబ్లెట్లతో త్వరగా విటమిన్స్ పొందాలని ప్రయత్నిస్తున్నారు. విటమిట్-డి ట్యాబ్లెట్లు అధికంగా వాడితే శరీరంలో కాల్షియం స్థాయి అధికమై విషతుల్యాలు పెరుగుతాయని కోకిలా బెన్ ధీరూబాయ్ అంబానీ ఆస్పత్రి సర్వేలో పేర్కొన్నారు. విటమిన్-డి మోతాదుకు మించి తీసుకుంటే కిడ్నీలు చెడిపోయే ప్రమాదం కూడా ఉన్నది. కాబట్టి వీలైనంత వరకు ఆహారపదార్థాల ద్వారానే విటమిన్లు పొందాలని వైద్యులు సూచిస్తున్నారు.