‘‘కారు’’కు లక్ష మెజార్టీ పక్కానా?

Update: 2016-02-14 04:23 GMT
తెలంగాణలో జరిగిన నారాయణ ఖేడ్ ఉప ఎన్నిక ముగిసింది. తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు వ్యక్తిగతంగా తీసుకొని ప్రచారం చేసిన ఈ ఉప ఎన్నికల్లో టీఆర్ ఎస్ 50 వేల మెజార్టీ పక్కా అని హరీశ్ కాన్ఫిడెంట్ గా చెప్పటం తెలిసిందే. శనివారం జరిగిన పోలింగ్ రికార్డు స్థాయిలో జరగటం విశేషం. సాయంత్రం 5 గంటలకు ముగిసిన ఉప ఎన్నికల పోలింగ్ 81.7గా నమోదు కావటం గమనార్హం.

పోలింగ్ ప్రారంభమైన నాటి నుంచి ఓటర్లు ఆసక్తిగా ఓట్లు వేశారు. ఊహించిన దాని కంటే ఓటింగ్ జరగటంతో తెలంగాణ అధికారపక్షం గెలుపు దీమాను వ్యక్తం చేస్తోంది. ఈ మధ్యకాలంలో జరిగిన ప్రతి ఎన్నికలోనూ తన సత్తా చాటటమే కాదు.. రికార్డుల్ని బ్రేక్ చేసేలా ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో నారాయణ ఖేడ్ ఫలితం అదే రీతిలో ఉంటుందని చెబుతున్నారు.

మొత్తం 2.5లక్షల మంది ఓటర్లు ఉండే నారాయణ ఖేడ్ లో 81.7గా పోలింగ్ నమోదు అయిన నేపథ్యంలో తెలంగాణ అధికారపక్ష అభ్యర్థికి తక్కువలో తక్కువ లక్షకు పైనే మెజార్టీ లభించే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకవేళ అలాంటి ఫలితమే ఏర్పడితే.. తెలంగాణలో విపక్షాలు మరింత బిక్కచచ్చిపోవటం ఖాయం.
Tags:    

Similar News