• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  హరీశ్..ఉమలు చెబుతున్న...

హరీశ్..ఉమలు చెబుతున్న మొండివాదం..వితండవాదం ఇదే

By - Tupaki Desk
Update: 2016-06-23 04:22 GMT
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నడుస్తున్న కృష్ణా జల వివాదం మరో మలుపు తిరిగింది. అధికారుల మధ్య సాగిన చర్చలు ఒక కొలిక్కి రాకపోవటం.. ఈ వ్యవహారంలో రెండు రాష్ట్రాలు కూర్చొని  ఏకాభిప్రాయానికి రావాలని కేంద్రం తేల్చి చెప్పింది. మరోవైపు ఈ వ్యవహారంపై రెండు రాష్ట్రాలకు చెందిన ఇరిగేషన్ మంత్రులు హరీశ్ రావు.. దేవినేని ఉమలు కూర్చొని మాట్లాడుకున్నా పెద్దగా ఫలితమేమీ లేదు. ఈ వివాదంపై ఇరు వర్గాల వారు తమదైన శైలిలో ఎదుటి పక్షం వారిని తప్పు పడుతూ మీడియా ఎదుట వ్యాఖ్యలు చేయటం గమనార్హం.

కృష్ణా జలాల వివాదం మీద తెలంగాణ మంత్రి హరీశ్ మాట్లాడుతూ.. ఈ విషయం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేసేది వితండవాదంగా ఆరోపిస్తే. దీనికి కౌంటర్ అన్నట్లు ఏపీ సాగునీటి శాఖామంత్రి దేవినేని ఉమ మాట్లాడుతూ.. ఈ వివాదం మీద తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నది మొండివాదనగా చెప్పుకొచ్చారు. ఇలా మాటకు మాట అనుకుంటున్న ఇరువురు నేతల వాదనల్ని ఎవరికి వారిగా చూస్తే..

హరీశ్ ఏమంటున్నారంటే..

= కృష్ణా జలాల వినియోగంపై రెండు రోజులుగా కృష్ణా బోర్డు.. కేంద్ర అధికారులతో చర్చలు జరుపుతున్నా ఆంధ్రప్రదేశ్ వితండవాదన వాల్లే ఫలితాలు ఇవ్వటం లేదు.

= కృష్ణా బోర్డు ఆదేశాల్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోంది.

= కృష్ణా బోర్డు పరిధిలోని అన్ని ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకొస్తే మాకెలాంటి అభ్యంతరం లేదు. మరి.. దీనికి ఏపీ సిద్ధమేనా?

= నాగార్జునసాగర్ ఒక్కదాన్నే బోర్డు పరిధిలోకి తేవాలనటం ఎంతవరకు సమంజసం?

= పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమైనందున 45టీఎంసీలు.. పట్టిసీమ ద్వారా చేసిన అనుసంధానం ద్వారా మరో 45 టీఎంసీలు మొత్తం 90టీఎంసీలు గోదావరి నీటిని తెలంగాణకు ఇవ్వాలని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాం.

= ఆంధ్రప్రదేశ్ కు గత ఏడాది ఇవ్వాల్సిన దాని కంటే ఎక్కువ నీరు ఇచ్చాం. మూడో పంటకు సాయం చేశాం.

దేవినేని ఉమ ఏం చెబుతున్నారంటే..

= కృష్ణా బోర్డు విషయంలో తెలంగాణ మొండివాదన చేస్తుంది.

= తెలంగాణకు చెందిన నీటి బొట్టు కూడా ఆంధ్రప్రదేశ్ కు అక్కర్లేదు.

= కృష్ణా నదిపై ఉన్న అన్ని ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకొస్తామని బోర్డు ముసాయిదా పత్రాన్ని రూపొందించింది.

= కానీ.. నాగార్జునా సాగర్ ప్రాజెక్టు ఒక్కటే బోర్డు పరిదిలోకి తెస్తామని తెలంగాణ ప్రభుత్వం మభ్య పెడుతోంది.

= ముసాయిదాను రూపొందించటానికి రెండు నెలల ముందే రెండు రాష్ట్రాలతో కృష్ణా బోర్డు చర్చించింది.

= కానీ.. తెలంగాణ తప్పుడు ఆరోపణలు చేస్తోంది. దీనికి ఈ ఉదంతమే పెద్ద ఉదాహరణ.

= కృష్ణా బోర్డు ఆదేశించినప్పటికి 4 టీఎంసీల నీటిని ఆలస్యంగా విడుదల చేశారు.

= గత ఏడాది చేసుకున్న ఒప్పందాలు అమలు చేయకపోవటం వల్లే కృష్ణా బోర్డు ముసాయిదా రూపొందించాల్సి వచ్చింది.
Tags:    
  • Harish Rao 
  • Devineni Uma 
  • Irrigation Projects 

Similar News

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

కష్టజీవులకు భరోసా.. నిర్మాణ రంగానికి ఊతం : ఏపీలో ‘లేబర్ అడ్డా’ల విప్లవం!

2026-11-19 08:05 GMT

రూ.7 కోట్ల ఉద్యోగాల స్కాం : కుట్ర జరిగిందంటున్న జనసేన నేతలు.. అసలు నిజం ఇదే!

2026-11-19 08:02 GMT

ఆకాశంలో అంబానీ 'సిగ్నల్'.. మస్క్‌కు ఇక టెన్షన్ షురూ.. ఇప్పుడు స్పేస్‌లో శాటిలైట్ల జాతర

2026-11-19 06:00 GMT

వాన్స్‌కు షాక్ ఇవ్వనున్న ట్రంప్.. 2028 రేసులో రూబియో పేరు!

2026-11-19 05:37 GMT

Copyright @2026

Powered by Blink CMS