పాక్ టిక్ టాక్ స్టార్‌...15 సెక‌న్ల వీడియో..న‌గ్నంగా...

Update: 2020-01-03 04:09 GMT
పాకిస్థాన్‌ కు చెందిన హరీమ్ షా అనే టిక్ టాక్ స్టార్ మ‌రోమారు వివాదాల్లోకి ఎక్కారు. కొద్దికాలం క్రితం టిక్ టాక్ లైక్‌ల కోసం ఏకంగా ఆ దేశ విదేశాంగ శాఖ కార్యాలయం లోనే టిక్ టాక్ వీడియో చేశారు. పాక్ విదేశాంగ కార్యాలయం లోకి ప్రవేశించిన హరీమ్ షా.. విదేశాంగ శాఖ మంత్రి కుర్చీ లో కూర్చొని వీడియోను రికార్డు చేశారు. ఇది పెద్ద వివాదం గా మారింది. తాజాగా పాకిస్థాన్ రైల్వేశాఖ మంత్రి రషీద్ అహ్మద్ అస‌భ్య సంభాష‌ణ‌తో ఆమె మ‌ళ్లీ తెర‌కెక్కారు. అదే స‌మ‌యంలో మంత్రి అడ్డంగా బుక్క‌య్యారు.


టిక్ టాక్ స్టార్ హరీమ్ షాతో పాకిస్థాన్ రైల్వేశాఖ మంత్రి రషీద్ అహ్మద్ వీడియో కాల్ మాట్లాడుతూ....అస‌భ్య సంభాష‌ణ చేశారు. మీరు నగ్నంగా ఉండి చూపించేవారు, కెమెరాలో కూడా అనుచితమైన పనులు చేసేవారని మంత్రి వ్యాఖ్యానించ‌డం...దానికి ఆమె స్పందించ‌డం...ప‌క్క‌న ఉన్న వారు న‌వ్వ‌డం....ఇలా 15 నిమిషాల వీడియో రికార్డింగ్ సోష‌ల్ మీడియాలో చేరింది. దీంతో మంత్రిగారు, సోష‌ల్ మీడియా స్టార్ బాగోతం వైర‌ల్ అయింది. అయితే, ఈ వీడియోలో ఉన్న మంత్రికి కాకుండా...పాల్గొన్న హరీమ్ షాకు బెదిరింపులు రావడం తో ఆమె దేశాన్ని వదలిపెట్టి వెళ్లాల్సి వచ్చింది. అజ‌ర్‌బైజాన్ దేశం చేరిన ఆమె కెన‌డాకు వెళ్లాల‌ని చూస్తున్న‌ట్లు స‌మాచారం. ఆ దేశంలో పౌర‌స‌త్వం తీసుకోవాల‌నే ఆలోచ‌న‌ లో ఉన్న‌ట్లు తెలిపింది.

మ‌రోవైపు అసభ్యం గా మాట్లాడిన వీడియో వైర‌ల్ వివాదానికి ఆమె ఆస‌క్తిక‌ర ట్విస్ట్ ఇచ్చారు. మంత్రి రషీద్ అహ్మద్ తమ కుటుంబ సభ్యుడి లాంటి వాడ‌ని, తన కుటుంబసభ్యులు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీలో ఉన్నార‌ని తెలిపారు. తాను ప్ర‌ధానికి పెద్ద ఫ్యాన్ అని ఆమె ప్ర‌క‌టించుకుది.
Tags:    

Similar News