• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  డీఎస్ కుమారుడిపై లైంగిక...

డీఎస్ కుమారుడిపై లైంగిక ఆరోపణలు..?

By - Tupaki Desk
Update: 2018-08-02 15:28 GMT
మాజీ మంత్రి, ఉమ్మడి రాష్ట్రంలో రెండు సార్లు పీసీసీ ప్రెసిడెంటుగా పనిచేసి ఆ తరువాత టీఆరెస్‌ లోకి వచ్చిన సీనియర్ లీడర్ డీఎస్‌‌ ను అదే టీఆరెస్ పార్టీ ఇబ్బంది పెడుతుందన్న విమర్శలు వస్తున్నాయి. టీఆరెస్‌ లోకి వచ్చినా తగిన ప్రాధాన్యం లేకపోవడంతో ఇమడలేకపోతున్న డీఎస్ బీజేపీలోకి వెళ్తున్నారన్న ప్రచారం కొద్దికాలంగా ఉంది. దీనిపై కొద్ది రోజులుగా డీఎస్ - టీఆరెస్ మధ్య రగడ జరుగుతోంది. డీఎస్ కుమారుల్లో ఒకరైన అరవింద్ బీజేపీలో చేరారు. అంతేకాదు... నిజామాబాద్ ఎంపీగా ఆయన పోటీ చేస్తారన్న ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. నిజామాబాద్ ఎంపీగా కేసీఆర్ కుమార్తె కవిత ఉన్నారు. దీంతో... డీఎస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ కవిత బాహాటంగానే విమర్శిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో డీఎస్ కు టీఆరెస్ కు సంబంధాలు దాదాపు తెగిపోయాయి.
   
ఇదంతా ఇలా ఉంటే... తాజాగా డీఎస్ మరో కుమారుడు - నిజామాబాద్ మాజీ మేయర్ అయిన సంజయ్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. విద్యాసంస్థలకు అధిపతి అయిన సంజయ్ తన కాలేజీల్లో చదివే అమ్మాయిలను లైంగికంగా హింసిస్తున్నారంటూ 11 మంది విద్యార్థినులు హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డికి ఫిర్యాదు చేశారు. వీరు పీడీఎస్‌ యూ నేత సంధ్యను కలవగా.. అక్కడి నుంచి హోమంత్రిని కలిశారు. రేపు పోలీసులకు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటారని హోమంత్రి చెప్పారు.
   
సంజయ్ నిర్వహించే కాలేజీ విద్యార్థులు ఇలాంటి ఆరోపణలు గతంలోనూ చేశారు. ఆయనపై ఇలాంటి ఆరోపణలు నిజామాబాద్‌లో బాగా వ్యాప్తిలో ఉన్నాయి. అయితే... ఇప్పుడు ఒకేసారి ఇంతమంది అమ్మాయిలు బయటకొచ్చి హోంమంత్రిని కలిసి ఫిర్యాదు చేయడం వెనుక రాజకీయ అంశాలున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అమ్మాయిలు లైంగిక హింసకు గురికావడం బాధాకరమే అని.. నిందితులను శిక్షించడం తప్పనిసరి అని అంటూనే నిజామాబాద్ ప్రజలు ఇందులో రాజకీయ కుట్ర కోణం కూడా ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. టీఆరెస్‌ లో ఉంటూనే కవితకు పోటీగా కొడుకును పోటీ దించేందుకు ప్రయత్నించడంతోనే డీఎస్‌‌పై ఉచ్చు బిగిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

Tags:    
  • Harassment allegations 
  • D Srinivas son 
  • Sanjay 

Similar News

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

కష్టజీవులకు భరోసా.. నిర్మాణ రంగానికి ఊతం : ఏపీలో ‘లేబర్ అడ్డా’ల విప్లవం!

2026-11-19 08:05 GMT

రూ.7 కోట్ల ఉద్యోగాల స్కాం : కుట్ర జరిగిందంటున్న జనసేన నేతలు.. అసలు నిజం ఇదే!

2026-11-19 08:02 GMT

ఆకాశంలో అంబానీ 'సిగ్నల్'.. మస్క్‌కు ఇక టెన్షన్ షురూ.. ఇప్పుడు స్పేస్‌లో శాటిలైట్ల జాతర

2026-11-19 06:00 GMT

వాన్స్‌కు షాక్ ఇవ్వనున్న ట్రంప్.. 2028 రేసులో రూబియో పేరు!

2026-11-19 05:37 GMT

Copyright @2026

Powered by Blink CMS