షరతులతో సుజనా చౌదరి ప్రయాణానికి కోర్టు ఓకే
బీజేపీ రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరికి ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఇటీవల ఊహించని షాక్ తగిలింది. ఆయన అమెరికాకు వెళ్లేందుకు ప్రయత్నించగా ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. ఇప్పటికే పలు కేసుల్లో ఉన్న ఆయనకు సీబీఐ గతంలో జారీ చేసిన లుక్ ఔట్ నోటీసుల కారణంగా సుజనా విదేశీ ప్రయాణానికి ఢిల్లీ ఎయిర్ పోర్టులోని ఇమ్మిగ్రేషన్ అధికారులు బ్రేక్ వేశారు.
అమెరికాలో అనారోగ్యంతో ఉన్న తన మామను చూసేందుకు సుజనా చౌదరి అమెరికా వెళ్లేందుకు ప్రయత్నించగా ఇమ్మిగ్రేషన్ అధికారులు శుక్రవారం ఢిల్లీ విమానాశ్రయంలో ఆయనను అడ్డుకున్నారు.
దీంతో తనపై ఉన్న లుక్ ఔట్ నోటీసులను సవాల్ చేస్తూ.. తనను అమెరికా వెళ్లేందుకు అనుమతించాలని కోరుతూ సుజనా చౌదరి తెలంగాణ హైకోర్టులో అత్యవసర పిటీషన్ దాఖలు చేశారు. అధికారులు నిర్బంధించి వేధింపులకు గురిచేస్తున్నారని కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. తనపై అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులకు గురిచేశారని పిటీషన్ లో పేర్కొన్నారు.
సుజానాపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని..సీబీఐ కేసులో విచారణకు సహకరిస్తున్నారని కోర్టులో సుజనా లాయర్లు వాదించారు. పిటీషనర్ ఎంపీ కావడంతో రెండు వారాలపాటు అమెరికా వెళ్లేందుకు అనుమతించినట్లు న్యాయమూర్తి పేర్కొన్నారు. అయితే గడువులోపు తిరిగి రావాలని వచ్చిన వెంటనే ఇమిగ్రేషన్ శాఖకు, సీబీఐకి సమాచారం ఇస్తాననే హామీ ఇవ్వాలని న్యాయమూర్తి షరతు విధించారు.