కరోనా కాక్టెయిల్ కు గ్రీన్ సిగ్నల్.. షరతులు వర్తిస్తాయ్!
కరోనా బాధితుల్లో రోగనిరోధక శక్తిని పెంచడానికి ఔషధ గుణాలు కలగలిసిన కాక్టెయిల్ అందుబాటులోకి వచ్చింది. ఇవి భారతదేశంలో త్వరలో వినియోగంలోకి రానున్నాయి. కొవిడ్ యాంటీబాడీ కాక్టెయిల్ వినియోగానికి భారత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే కొన్ని షరతులు వర్తిస్తాయ్ మరి. ఇక దీనిని అమెరికా, యూరోపియన్ దేశాల్లో ఇప్పటికే ఉపయోగిస్తున్నారు. ఆ దేశాల్లో మంచి ఫలితాలు వచ్చినట్లు తెలుస్తోంది. సెంట్రల్ డ్రగ్ కంట్రోల్ ఆర్గనేజేషన్ అనుమతులు ఇటీవలె లభించాయి.
ఈ కాక్టెయిల్ వాడకానికి దీనిని రూపొందించిన సంస్థ రోచే ఫార్మసీ కొన్ని షరతులు విధించింది. 12 ఏళ్లు పైబడిన వారు మాత్రమే ఈ కిట్ ఉపయోగించాలని సూచించింది. అంతేకాదు బరువు 40 కేజీల పైనే ఉండాలని పేర్కొంది. ఆక్సిజన్ స్థాయి 90 కన్నా తక్కువగా ఉండకూడదని స్పష్టం చేసింది. దీని ఒక్క డోసులో 600 మిల్లీ గ్రాముల కాసిరివిమాబ్, 600 మిల్లీ గ్రాముల ఇమ్ డెవిమాబ్ ఔషధాలు ఉన్నాయని తెలిపింది.
భారతదేశంలో సిప్లా సంస్థ ఈ కాక్టెయిల్ ను పంపిణీ చేయనుంది. భారతీయుల్లోనూ సానుకూల ఫలితాలు ఇస్తుందని రోచే సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది. ఇది కరోనా తీవ్రరూపం దాల్చకుండా సాయపడుతుందని తెలిపింది. ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరం ఉండదని పేర్కొంది. హోం ఐసోలేషన్ లోనే కోలుకుంటారని వివరించింది. ఒక్కో బాధితుడు ఒక్కో డోసు వాడాల్సి ఉంటుందని వెల్లడించింది. ఒక్క డోసు ధర రూ.59,750 అని, ఇద్దరు వ్యక్తులకు రూ.1,19,500 గా నిర్ణయించినట్లు తెలిపింది.
ఈ మందులను ఉపయోగించిన వారిలో 70శాతం మంది నాలుగు రోజుల్లోనే వైరస్ నుంచి కోలుకున్నారని రోచే సంస్థ వెల్లడించింది. కాక్టెయిల్ తో వ్యాధి అతి తీవ్ర ప్రమాదం నుంచి ఉపశమనం పొందవచ్చునని నిపుణులు అంటున్నారు. కొవిడ్ రెండో దశ కాలంలో ఇది చాలా ఉపయోగపడుతుందని అంటున్నారు. ఆస్పత్రులకు వెళ్లే అవకాశాలు తక్కువగా ఉంటాయని చెబుతున్నారు. రోగ నిరోధన శక్తి పెరిగి ప్రమాదం తగ్గుతుందని వివరించారు.