మనవరాలికి తల్లి అయిన అమ్మమ్మ
తన కూతురు పిల్లలను కనలేదని తెలిసి ఆమె కోసం మరోసారి తల్లిగా మారింది ఓ పెద్దావిడ. అంటే తన కడుపులో మనవరాలికి జన్మనిచ్చిందన్న మాట.. ఈ అద్భుతం అమెరికాలో జరిగింది.
తన కూతురు పిల్లలు కనలేదని నిర్ధారణ కావడంతో చికాగోలోని ఇల్లినాయిస్ కు చెందిన జూలి లవింగ్ తమ వారసులను తనే కనాలని డిసైడ్ అయ్యింది. 29 ఏళ్ల కూతురు బ్రెన్నా లాక్ వుడ్.. ఆమె భర్త ఆరోన్ లు కలిసి ఐవీఎఫ్ పద్ధతిలో ఎన్నో సార్లు ప్రయత్నించినా బిడ్డను కనలేకపోయారు. దీంతో సరోగసి విధానంలో 50 ఏళ్ల జూలి లవింగ్ వారి బిడ్డను కనడానికి ముందుకు వచ్చింది. అంటే మనవళ్లను కనడానికి ఒప్పుకుందన్న మాట..
సహజంగా అథ్లెట్ కావడంతో ఫిట్ గా ఉండే జూలి తన 50వ ఏట ఈనెల మొదటి వారంలో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తన కూతురును తల్లిని చేసింది. తను అమ్మమ్మ అయ్యింది.
బ్రెన్నా ఈ వివరాలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయ్యింది. బ్రెన్నా ఇది వరకు రెండు సార్లు గర్భం దాల్చినా అబార్షన్ అయ్యింది. ఒక సారి కవలలు పుట్టి చనిపోయారు. దీంతో తల్లి కావడానికి తన తల్లినే ఆశ్రయించి ఎట్టకేలకు బిడ్డను దక్కించుకుంది. సొంత మనవరాలికి తల్లిగా మారిన జూలీ నవంబర్ 2న ప్రసవించింది. ఆ పాపకు ‘బ్రియర్ జూలియట్ లాక్ వుడ్’ అని పేరు పెట్టి తల్లిని స్మరించుకుంది బ్రెన్నా..