ఛత్తీస్ గఢ్ బడుల్లో బూతు పాఠాలు

Update: 2015-10-08 10:18 GMT
దేశంలోని విద్యావ్యవస్థ తీరుతెన్నులపై మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అనేకసార్లు ఆవేదన వ్యక్తం చేశారు... ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా చాలాసార్లు మన దగ్గర విద్యా నాణ్యత, విద్యా విధానాలు, విద్య విషయంలో ప్రభుత్వాలకు సీరియస్ నెస్ లేకపోవడంపై వివిధ వేదికలపై అసంతృప్తి వ్యక్తంచేశారు.... అలాంటి మేధావుల అభిప్రాయాలు నూటికి నూరు శాతం నిజమని ఇటీవల కొన్ని రాష్ట్రాల్లోని పాఠ్య పుస్తకాల్లో ఉన్న పాఠాలు నిరూపించాయి.

వాటిలో ఉన్న తప్పులు, పాఠ్యాంశాల ఎంపికలో నిర్లక్ష్యం, దోషాలు వంటివెన్నో ముక్కున వేలేసుకునేలా చేశాయి. రాజస్థాన్ - మధ్యప్రదేశ్ - ఛత్తీస్ గఢ్ లలో ఇలాంటి ఉదాహరణలు కనిపించాయి. తాజాగా ఛత్తీస్ గఢ్ లోనే అలాంటిదే మరో సంఘటన బయటపడింది.

చత్తీస్‌గఢ్‌ రాష్ట్ర ప్రభుత్వం ప్రచురించిన పుస్తకంలో ''దేశంలో నిరుద్యోగ సమస్యకు కారణం మహిళా ఉద్యోగులే'' అని ఉన్న విషం గతంలో వివాదాస్పదమైంది. తాజాగా అంతకుమించిన వివాదమొకటి చెలరేగింది... ఆశారాం బాపు చెప్పిన సెక్స్ టిప్స్‌కు సంబంధించిన 'దివ్య ప్రేరణ్' పుస్తకాలను ఛత్తీస్ గఢ్ లో స్కూలు విద్యార్థులకు పంచారట. ఒక పాఠశాలలోనైతే ఏకంగా ఈ పుస్తకాలలోని శృంగార సలహాలను పిల్లలతో బిగ్గరగా చదివించారట.  

ఆ పుస్తకంలో శృంగారానికి సంబంధించిన అనేక విషయాలున్నాయట.... దాన్ని శృంగార పుస్తకంగా భావించక చూసీచూడకుండానే ఆధ్యాత్మిక పుస్తకంగా భావించి గతంలో పాఠశాలలకు పంచారు. ఆ తరువాత విషయం తెలుసుకుని 2012లో ప్రభుత్వం దాన్ని నిషేధించింది... కానీ, ఆ ఆదేశాలు కొన్ని పాఠశాలలకు చేరకపోవడంతో ఇప్పటికీ అందులోని పాఠాలను పిల్లలకు చెబుతున్నారట.  తాజాగా ఈ విషయం రచ్చరచ్చ కావడంతో ప్రభుత్వం దీనిపై విచారణకు ఆదేశించింది.
Tags:    

Similar News