• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  కేసీఆర్ ను ఆకాశానికి...

కేసీఆర్ ను ఆకాశానికి ఎత్తేసిన గ‌వ‌ర్న‌ర్

By - Tupaki Desk
Update: 2017-01-02 04:32 GMT
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావును రాష్ట్ర గవర్నర్ నరసింహన్ మ‌రోమారు ప్రశంసించారు. అయితే ఈ ద‌ఫా అనూహ్య రీతిలో ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. చీకటి నుంచి వెలుగులకు నడిపించిన నాయకుడు అంటూ  కేసీఆర్ ను కీర్తించారు. కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ నంబర్ వన్‌గా నిలుస్తుందన్నారు. మిషన్ భగీరథ - మిషన్ కాకతీయ బ్రహ్మాండంగా ఉన్నాయని గ‌వ‌ర్న‌ర్‌ కొనియాడారు. అవినీతిరహిత సమాజ నిర్మాణంవైపు తెలంగాణ ప్రభుత్వం అడుగులేస్తున్నదని కొత్త సంవత్సరం వేడుకల్లో గవర్నర్ చెప్పారు. 2017 తెలంగాణకు కార్యసాధక సంవత్సరమని అభివర్ణించారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు తన మంత్రివర్గ సహచరులు - అధికారులతో ఆదివారం రాజ్‌ భవన్‌ లో. గవర్నర్‌ ను కలిసి.. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ పై విధ‌మైన ప్ర‌శంస‌లు చేశారు.

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు సమర్థ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో మొదటి స్థానంలో నిలుస్తుందని గవర్నర్ ఈఎస్‌ ఎల్ నరసింహన్ తెలిపారు. చీకటినుంచి వెలుగులోకి నడిపించిన డైనమిక్ లీడర్ కేసీఆర్ అని ప్రశంసించారు.  ముఖ్యమంత్రి కేసీఆర్‌ లో తాను గమనించిన ఉన్నతమైన లక్షణాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రజలకు ఉపయోగపడుతుందంటే ఎలాంటి భేషజాలకు పోకుండా ఇతరుల సలహాలను కూడా సీఎం పరిగణనలోకి తీసుకుంటారన్నారు. ఇటువంటి సీఎం గురించి తానెక్కడా వినలేదని చెప్పారు. "అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. ఆ తర్వాత పరిణామాలెలా ఉన్నా ఎదుర్కోవడానికి సిద్ధమవుతారు తప్ప వెనుకడుగు వేయరు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి విద్యుత్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. రాష్ట్రం అంధకారాన్ని ఎదుర్కొనే పరిస్థితి ఉండేది. కానీ తమసోమా జ్యోతిర్గమయ అన్నట్లు చీకటి నుంచి వెలుగులోకి నడిపిన నాయకుడిగా కేసీఆర్ నిలిచారు" అని గవర్నర్ ప్రశంసించారు. కేసీఆర్ చీకటి అనే పదానికే కొత్త నిర్వచనమిచ్చారని అన్నారు. విద్యుత్‌ రంగంలో అనూహ్యమైన రీతిలో సాధించిన ప్రగతి మహాద్భుత ఘట్టంగా ఆయన అభివర్ణించారు. డైనమిక్ లీడర్ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాలలో దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తుందని అన్నారు. 2017 తెలంగాణకు కార్యసాధక సంవత్సరంగా ఉంటుందని విశ్వాసం వ్యక్తంచేశారు. రాష్ట్రం ఏర్పడి 31 నెలలు గడిచిన క్రమంలో తెలంగాణ రాష్ట్రం నిర్దిష్టమైన లక్ష్యంతో సంక్షేమ - అభివృద్ధి పథకాలను ముందుకు తీసుకెళుతున్నదని చెప్పారు. పక్కా ప్రణాళికతో వివిధ పథకాల అమలు తీరు భేష్ అని గ‌వ‌ర్న‌ర్ ప్రశంసించారు. 

ప్రతి ఇంటికీ సురక్షితమైన నీటిని సరఫరా చేయడానికి ఉద్దేశించిన మిషన్ భగీరథ గురించి గ‌వ‌ర్న‌ర్ చెప్తూ.. జాక్ అండ్ జిల్ వెంట్ అప్ ది హిల్ టు ఫెచ్ ఎ పేల్ ఆఫ్ వాటర్ అన్న ఇంగ్లిష్ కవితను ప్రస్తావించారు. బకెట్ నీళ్ల కోసం ఇబ్బందులు పడాల్సిన అవసరం లేకుండా ప్రతీ పౌరునికీ నీటిని అందించాలన్న లక్ష్యంతో చేపట్టిన మిషన్ భగీరథ బృహత్తర కార్యక్రమమని అభివర్ణించారు. మిషన్ కాకతీయ రెండు దశల పనులు పూర్తయిన క్రమంలో తెలంగాణ త్వరలో మంచి ఫలాలను అందుకోబోతున్నదన్నారు. మిషన్ కాకతీయకు వరుణుడి కరుణ కూడా తోడుకావడంతో సాగుకు చాలినంత నీరు అందుబాటులోకి వచ్చిందని గ‌వ‌ర్న‌ర్‌ పేర్కొన్నారు.  సమాచార - సాంకేతిక రంగంలో తెలంగాణ సృజనాత్మకమైన ఆలోచనలతో అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నదని గవర్నర్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం కొత్త కొత్త విధానాలతో మార్గదర్శకంగా నిలుస్తుందని చెప్పారు. ఈ విషయంలో ఆయన ప్రత్యేకంగా మంత్రి కేటీ రామారావును ప్రశంసించారు. గతంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కేవలం కొన్ని వర్గాలకే పరిమితమైనదని, కానీ ప్రభుత్వ కృషివల్ల అది సామాన్య ప్రజలకు అందుబాటులోకి వచ్చిందని చెప్పారు. సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలుచేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకుంటున్నదని గ‌వ‌ర్న‌ర్‌ అన్నారు. 

రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన టీ-హబ్ అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని - మంచి ఆలోచనలున్న ఔత్సాహికులకు ఒక వేదికగా మారిందని గ‌వ‌ర్న‌ర్‌ చెప్పారు. ఈ ఏడాదిలో టీ-హబ్ కేంద్రంగా కొందరు ప్రపంచం గర్వించదగ్గ రీతిలో కొత్త విధానాలను కనుగొంటారన్న విశ్వాసాన్ని గవర్నర్ వ్యక్తంచేశారు. తెలంగాణ పోలీసులు అంకితభావంతో పనిచేస్తూ శాంతిభద్రతలను కాపాడుతున్నారని ప్రశంసించారు. పోలీసులు శాస్త్ర - సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి హైదరాబాద్ నగరాన్ని ఉద్రిక్తతల నుంచి విముక్తి (టెన్షన్ ఫ్రీ) కలిగించారని గ‌వ‌ర్న‌ర్‌ అన్నారు. టీఎస్-ఐపాస్ - సులభ వాణిజ్య విధానాల (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌) వల్ల తెలంగాణకు భారీ మొత్తంలో పెట్టుబడులు వస్తున్నాయని వివరించారు. ఈ పెట్టుబడులు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను పెంచుతున్నాయన్నారు. కేసీఆర్ ప్రభుత్వం మంచి టీమ్ స్పిరిట్‌తో పనిచేస్తున్నదని గవర్నర్ నరసింహన్ ప్రశంసించారు. ముఖ్యమంత్రితోపాటు మంత్రులు - అధికారులు - ఉద్యోగులు పైనుంచి కింది స్థాయివరకు ఒక కుటుంబంగా, కష్టపడి, సమన్వయంతో పనిచేస్తున్నారని గ‌వ‌ర్న‌ర్‌ విశ్లేషించారు. టీమ్ స్పిరిట్‌ను తీసుకురావడంలో కేసీఆర్ ప్రత్యేక కృషి జరిపారని తెలిపారు. సమాజంలో అన్ని స్థాయిల్లో అవినీతిని రూపుమాపాలని గవర్నర్ అభిలషించారు. అదే దారిలో ప్రభుత్వం కూడా నిర్దిష్టమైన చర్యలను తీసుకుంటున్నదన్నారు. ప్రభుత్వ చర్యల వల్ల అవినీతి నిర్మూలన జరిగి సంక్షేమ పథకాలు - ప్రాజెక్టులు సకాలంలో పూర్తయి, త్వరలోనే ప్రజలకు పూర్తి ఫలాలు అందుబాటులోకి వస్తాయని గ‌వ‌ర్న‌ర్ చెప్పారు. "అవినీతి లేని సమాజ నిర్మాణానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేయాలి. అధికారులకు ఏదైనా మంచి పని అనిపిస్తే దానిని అదే రోజు పూర్తి చేయాలి. అది దశాబ్దాల వరకు పునాదిగా ఉంటుంది. ఈ క్రమంలో అధికారులందరూ సహకరించి ముఖ్యమంత్రి రాష్ట్ర అభివృద్ధి కోసం నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించడానికి సహకరించాలి" అని గవర్నర్ కోరారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Governor Narasimhan 
  • KCR 
  • NEw Year 

Similar News

తనకంటే శక్తిమంతమైన మరో ఏఐని సృష్టించే స్థాయికి ఏఐ.. ఆందోళనలో టెక్ కంపెనీలు?

2026-11-06 15:30 GMT

టాప్ స్టోరి: యంగ్ అథ్లెట్లు త‌స్మాత్ జాగ్ర‌త్త‌.. కెరీర్‌ను నాశనం చేసే 4 పొరపాట్లు!

2026-11-06 14:30 GMT

టీటీడీకి లేట‌య్యే కొద్దీ.. 'కాంపిటీష‌న్' పెరుగుతోందిగా..!

2026-11-06 12:30 GMT

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

Copyright @2026

Powered by Blink CMS