• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  మొదటిసారి; చేతల్లో...

మొదటిసారి; చేతల్లో చూపించిన గవర్నర్‌

By - Tupaki Desk
Update: 2015-07-05 04:49 GMT
విభజన పుణ్యమా అని రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు కొత్తకాదు. ప్రతి విషయానికి ఏదో ఒక పంచాయితీతో రెండు రాష్ట్ర అధికారులు.. హైకోర్టుకు లేదంటే రెండు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్‌ అయిన నరసింహన్‌ వద్దకు వెళ్లటం తెలిసిందే.

గత పదమూడు నెలలుగా పలు అంశాలు తన దృష్టికి వచ్చినప్పటికీ కర్ర విరగకుండా.. పాము చావని చందంగా.. రెండు పక్షాలు సర్దుకు పోవాలన్నట్లుగా తీర్పులు చెప్పి పంపటం తెలిసిందే. ఇలాంటి తీర్పులపై తెలంగాణ సర్కారు కన్నా ఏపీ సర్కారే పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేసింది. తమకు న్యాయం జరగటం లేదని ఆరోపించింది.

ఇలాంటి వైఖరికి భిన్నంగా ఈసారి.. గవర్నర్‌ విస్పష్ట నిర్ణయం తీసుకోవటంతో పాటు.. రాతపూర్వకంగా సమాచారాన్ని ప్రభుత్వానికి పంపటం గమనార్హం. విభజన చట్టంలో పేర్కొన్న పదో షెడ్యూల్‌లోని అంశాల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. తెలుగు విశ్వవిద్యాలయం.. అంబేడ్కర్‌ యూనివర్సిటీ తమవేనని.. వాటి సేవలు కావాలంటే.. ముందుగా ఒప్పందం చేసుకోవాలంటూ  తెలంగాణ సర్కారు పేర్కొనటం తెలిసిందే.

దీనికి సంబంధించి రగిలిన వివాదాన్ని ఏపీ సర్కారు గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లటం.. ఆయన ఉదంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించి.. తెలుగు విశ్వవిద్యాలయం.. అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలకు సంబంధించి యథాతథస్థితిని అమలు చేయాలని.. తర్వాత నిర్ణయం తీసుకుందామని పేర్కొన్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరం వరకూ.. ఇప్పటివరకూ కొనసాగిన తీరునే కంటిన్యూ చేయాలన్న మాటను లిఖితపూర్వకంగా లేఖను ప్రత్యేక దూత చేత తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి పంపారు.

ఇంతకాలం ఇలాంటి చర్యలు తీసుకోని గవర్నర్‌.. తొలిసారి ఒక అంశంపై స్పష్టమైన వైఖరిని ప్రదర్శించారన్న వాదన వినిపిస్తోంది. మరి.. దీనిపై తెలంగాణ సర్కారు స్పందన ఎలా ఉంటుందో చూడాలి.



Tags:    
  • governor Narasimhan 
  • Telugu and Ambedkar University 

Similar News

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

టీటీడీకి లేట‌య్యే కొద్దీ.. 'కాంపిటీష‌న్' పెరుగుతోందిగా..!

2026-11-06 12:30 GMT

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

రూ. 40 కోట్లా? ఐపీఎల్ వేలానికి ముందే ఆటగాళ్ల డిమాండ్లు వైరల్

2026-11-06 07:49 GMT

Copyright @2026

Powered by Blink CMS