ఆర్థిక నేరగాళ్లు.. పరారీలో 58 మంది
బ్యాంకులకు కుచ్చు టోపి పెట్టి విదేశాలకు చెక్కేసిన ఆర్థిక నేరగాళ్లపై కేంద్రం సీరియస్ గా ఉంది. వేలాది కోట్ల రుణాలు ఎగ్గొట్టి ఇతర దేశాల్లో తిరుగుతున్న నేరగాలను స్వదేశానికి రప్పించే ప్రయాత్నాలను ముమ్మరం చేసింది. భారత్ లో రుణాలు తీసుకొని పరారైన వైట్ కాలర్ నేరగాళ్ల సంఖ్య ఇప్పటికి 58కి చేరింది. విజయ్ మాల్యాతో పాటు నీరవ్ మోదీ - మొహుల్ చోక్సీ - నితిన్ - చేతన్ సందేస్రా - లలిత్ మోదీ - యూరోపియన్ దళారీ గ్యూడో రాల్ప్ - హస్చకే - కార్ల్ గెరోసాలను వెనక్కి రప్పించే చర్యలను వేగవంతం చేసింది. ఇప్పటికే లుక్ అవుట్ సర్క్యలర్ (ఎల్ వోసీ), ఇంటర్ పోల్ ద్వారా నోటీసులు జారీ చేసింది.
అమెరికా - ఈజిప్ట్ - బ్రిటన్ - యూఏఈ - బెల్జియం - బార్బుడా - అంటిగా వంటి దేశాల్లో తలదాచుకున్న వైట్ కాలర్ దొంగలను అప్పగించాలని భారత్ ఆయా దేశాల ప్రభుత్వాలను కోరింది. ఇప్పటి వరకు చేసిన 16 అప్పగింత అభ్యర్థనలు ఎంత వరకు పురోగతి సాధించాయోనని సీబీఐ - ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ - డీఆర్ ఐ వంటి సంస్థలు ఆరా తీస్తున్నాయి. ఆయా దేశాల ప్రభుత్వాలపై మరింత ఒత్తిడి పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం లోక్ సభకు కూడా తెలిపింది. వీవీఐపీ హెలికాప్టర్ల కుంభకోణంలో మధ్యవర్తిగా వ్యవహరించిన గ్యూడో రాల్ఫ్ - కార్లో గెరోసాలను అప్పగించాలనే అభ్యర్థనతో పాటు ఆయా నోటీసుల తాజా పరిస్థితిని భారత విదేశాంగా శాఖ లోక్ సభకు సమర్పించింది. గెరోసా అప్పగింతపై గతేడాది నవంబరులో - గ్యూడో అప్పగింతపై ఈ సంవత్సరం జనవరిలో అభ్యర్థనలు పంపించినట్లు - ఇటలీ ప్రభుత్వం వాటిని తిరస్కరించినట్లు వివరించింది.
13వేల కోట్ల రూపాయల రుణాలు ఎగ్గొట్టిన మొహుల్ చోక్సీ అప్పగింతపై రెండు అభ్యర్థనలు పెండింగ్ లో ఉన్నాయి. చోక్సీపై ఇంటర్ పోల్ ద్వారా నోటీసులు జారీ చేశారు. అమెరికాలో ఉన్న గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఆశిష్ జోబన్ పుత్ర - ఆయన భార్య అప్పగించేందుకు ట్రంప్ సర్కార్ ఇప్పటికే భారత్ కు నివేదిక పంపింది. యూఏఈ నుంచి దీపక్ తల్వార్ ను తీసుకొచ్చేందుకు అవసరమైన న్యాయ పోరాటం చేస్తోంది. మరోవైపు స్టెర్లింగ్ బయోటిక ద్వారా బ్యాంకులకు రూ.5వేల కోట్లు కుచ్చుటోపి పెట్టిన చేతన్ - నితన్ - దీప్తి - సందేసర - హితేష్ కుమార్ పటేల్ పై రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. అగస్టా కుంభకోణంలో మధ్యవర్తి క్రిస్టియన్ మిషెల్ ను వెనక్కి తీసుకురావడంలో విజయవంతమైన బీజేపీ ప్రభుత్వం మిగిలిన వారిని తీసుకొస్తామన్న ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తోంది.