ఆర్టీసీ నేతలకు జలక్.. నలుగురికే అనుమతి

Update: 2019-10-26 12:24 GMT
ఆర్టీసీ కార్మికులతో చర్చలకు అంత సిద్ధమైన వేళ అధికారులు  షాకిచ్చారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఎర్రమంజిల్ లోని ఆర్ అండ్ బీ కార్యాలయానికి పెద్ద ఎత్తున చేరుకున్న ఆర్టీసీ కార్మిక నాయకులు - కార్మికులను లోపలికి అనుమతించలేదు. కేవలం నలుగురు మాత్రమే చర్చలకు రావాలంటూ అధికారులు మోకాలడ్డారు.

చర్చలకు ఆహ్వానించి  ఇలా నలుగురికే పరిమితం చేయడం ఏంటని ఆర్టీసీ  జేఏసీ కన్వీనర్ అశ్వాత్థామ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. హైకోర్టు సూచన మేరకు అందరు యూనియన్ల నేతలతో చర్చలు జరుపాలని డిమాండ్ చేశారు. వస్తే అందరం వస్తామని.. లేదంటే ఎవ్వరూ రామని భీష్మించుకు కూర్చున్నారు.

అయితే అధికారులు నలుగురికే అవకాశం ఇవ్వడం.. సమ్మె మొదలై చాలా రోజులు అవుతున్న దృష్ట్యా ప్రజల ఇబ్బందులను దృష్టి పెట్టుకొని కార్మిక నాయకులు వెనక్కి తగ్గారు. అధికారుల కోరిక మేరకు నలుగురే చర్చలకు వెళ్లారు.

ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి - రాజిరెడ్డి - వీఎస్ రావు - వాసుదేవరావులు ఆర్టీసీ యాజమాన్యంతో చర్చలు జరుపుతున్నారు. దీని ఫలితం ఏంటనేది ఈ రాత్రికి తేలే అవకాశం ఉంది.
Tags:    

Similar News