త్వరలో డయాలసిస్‌కు గుడ్‌బై .. హైబ్రిడ్‌ కిడ్నీ సిద్ధం !

Update: 2021-09-18 09:31 GMT
మూత్రపిండాల సమస్యలున్న వారు తరచూ కృత్రిమ పద్ధతులతో శరీరంలోని మలినాలను తొలగించుకుంటారనే సంగతి మనకు తెలిసిందే. డయాలసిస్‌ కి త్వరలోనే గుడ్‌ బై చెప్పే అవకాశం ఉంది. కాలిఫోర్నియా వర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్న కృత్రిమ కిడ్నీలు త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది మరి. సిలికాన్‌ ఫిల్టర్‌ తో పాటు సజీవమైన రీనల్‌ కణాలతో కూడిన ఈ హైబ్రిడ్‌ కిడ్నీ నమూనా ఇప్పటికే సిద్ధమైంది.

తొలి ప్రయోగాలు విజయవంతమయ్యాయి కూడా. కిడ్నీ వ్యవస్థకు అనుసంధానించి, శరీరంలోనే ఉంచేయగల తక్కువ సైజులో ఉంటుంది ఈ హైబ్రిడ్‌ కిడ్నీ. ఒకసారి అమర్చుకుంటే చాలు. బ్యాటరీల అవసరమూ లేకుండా మన రక్తం ప్రవహించే ఒత్తిడితోనే దాంట్లోని మలినాలను తొలగిస్తుంది. శరీరం ఈ మూత్రపిండాన్ని తిరస్కరించకుండా ఉంచేందుకు మందులేవీ వాడాల్సిన అవసరం లేదు. ద కిడ్నీ ప్రాజెక్ట్‌ పేరుతో కాలిఫోర్నియా వర్సిటీ వారు చేస్తున్న ఈ ప్రయత్నాల ఫలితంగా అరచేతిలో ఇమిడిపోయేంత చిన్న సైజు యంత్రం తయారైంది. కంప్యూటర్‌ చిప్‌ల తయారీలో ఉపయోగించే సిలికాన్‌ సాయంతో అతిసూక్ష్మమైన రంధ్రాలున్న ఫిల్టర్‌ను తయారు చేశారు.

పలుచటి ఈ సిలికాన్‌ ఫిల్టర్‌ పొరలు ఒకవైపు, రక్తంలో ఉండాల్సిన నీరు, ఇతర లవణాలను నియంత్రించే రీనల్‌ ట్యూబుల్‌ సెల్స్‌ తో కూడిన బయో రియాక్టర్‌ ఇంకోవైపు ఉంటాయి ఈ హైబ్రిడ్‌ కిడ్నీలో. రోగి తాలూకూ రోగ నిరోధక వ్యవస్థ ఈ కణాలపై దాడి చేసే అవకాశం లేకుండా తగిన రక్షణ ఏర్పాట్లు కూడా ఉన్నాయి. గతంలో ఈ రెండు భాగాలను విడివిడిగా పరీక్షించి సత్ఫలితాలు సాధించిన శాస్త్రవేత్తలు తాజాగా రెండింటినీ కలిపి పరిశోధనశాలలో పరీక్షించారు.

శరీరంలో రెండు మెయిన్ ధమనులకు ఈ హైబ్రిడ్‌ కిడ్నీని అనుసంధానించి, శుద్ధి చేయాల్సిన రక్తం ఒక గొట్టం గుండా దీంట్లోకి ప్రవేశపెడుతారు. శుద్ధి చేసిన రక్తం మరో ధమని గుండా శరీరంలోకి చేరుతుంది. వ్యర్థాలన్నింటినీ మూత్రాశయానికి మళ్లించి బయటకు పంపిస్తారు. ఈ హైబ్రిడ్‌ కిడ్నీలో రక్తంలో ఉండాల్సిన నీరు, ఇతర లవణాలను నియంత్రించే రీనల్‌ ట్యూబుల్‌ సెల్స్‌తో కూడిన బయో రియాక్టర్‌ ఉంటాయి. రోగి తాలూకూ రోగ నిరోధక వ్యవస్థ ఈ కణాలపై దాడి చేసే అవకాశం లేకుండా తగిన రక్షణ ఏర్పాట్లు కూడా ఉంటుంది. కాలిఫోరి్నయా వర్సిటీ శాస్త్రవేత్తల ఈ ప్రయత్నాలను మరింత విస్తృత స్థాయిలో చేపట్టేందుకు, తద్వారా సమర్థమైన కృత్రిమ మూత్రపిండాన్ని తయారు చేసేందుకు ‘కిడ్నీ–ఎక్స్‌’ప్రాజెక్టు ద్వారా ఇప్పటికే దాదాపు రూ.5 కోట్ల నిధులు కూడా అందాయి.
Tags:    

Similar News