మెలోనీ-మాక్రాన్‌.. ముద్దుల వ‌ర్షం!

వారిద్ద‌రూ రెండు దేశాల‌కు అధినేత‌లు. ఒక‌రు ఫ్రాన్స్ అధ్య‌క్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్‌.. మ‌రొక‌రు ఇట‌లీ ప్ర‌ధాన మంత్రి జార్జియా మెలోనీ.;

Update: 2026-04-18 18:36 GMT

వారిద్ద‌రూ రెండు దేశాల‌కు అధినేత‌లు. ఒక‌రు ఫ్రాన్స్ అధ్య‌క్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్‌.. మ‌రొక‌రు ఇట‌లీ ప్ర‌ధాన మంత్రి జార్జియా మెలోనీ. వీరిద్ద‌రూ కూడా బ‌హిరంగంగా ముద్దులు పెట్టుకోవ‌డం.. అందరి నీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. అయితే.. దీనిలో మాక్రాన్ చొర‌వే ఎక్కువ‌గా ఉంద‌ని.. ఇటలీ ప్ర‌క‌టించింది. రెండు దేశాల నేత‌లు.. ప‌ర‌స్ప‌రం ఎదురైన‌ప్పుడు.. మ‌ర్యాద పూర్వ‌కంగా యూరోప్ దేశాల‌లో ఈ విధానా న్ని అనుస‌రిస్తార‌ని దీనిలో త‌ప్పులేద‌ని నెటిజ‌న్లు కూడా వ్యాఖ్యానించారు.

అస‌లు ఏం జ‌రిగింది?

ప‌శ్చిమాసియాలో ఉద్రిక్త‌త‌లు, ఇంధ‌న భ‌ద్ర‌త వంటి అంశాల‌పై యూరోపియ‌న్ దేశాల అధినేత‌లు.. తాజాగా శ‌నివా రం ఫ్రాన్స్ రాజ‌ధాని ప్యారిస్‌లో భేటీ అయ్యారు. ఈ కార్య‌క్ర‌మానికి ఇట‌లీ మ‌హిళా ప్ర‌ధాని.. మెలోనీ కూడా వ‌చ్చారు. అయితే.. ఆమెను చూడ‌గానే.. ఫ్రాన్స్ అధ్య‌క్షుడు మాక్రాన్ ఉద్వేగానికి గుర‌య్యారు. ఆమెకు ఎదురేగి నేరుగా ఆలింగ‌నం చేసుకున్నారు. అంతేకాదు.. బుగ్గ‌ల‌పై ముద్దుల వ‌ర్షం కురిపించారు. ఈ ప‌రిణామం అక్క‌డున్న అతిథుల‌ను ఆశ్చ‌ర్యానికి గురి చేసింది.

ఎవ‌రీ మెలోనీ..

ఇటలీకి చెందిన మెలోనీ.. టీవీ యాంక‌ర్‌గా తన వృత్తిని ప్రారంభించారు. త‌ర్వాత‌.. రాజ‌కీయాల్లోకి వ‌చ్చా రు. ఈ క్ర‌మంలోనే 2022లో తొలిసారి.. ఇట‌లీ ప్ర‌ధాన మంత్రి ప‌గ్గాలు చేప‌ట్టిన మ‌హిళ‌గా రికార్డు సృష్టించా రు. ప్ర‌స్తుతం ఆమె వ‌య‌సు 49 సంవ‌త్స‌రాలు. భ‌ర్త‌, ఒక కుమారుడు ఉన్నారు. అయితే.. మెలోనీ.. మాక్రాన్‌లు త‌ర‌చుగా క‌లుసుకోవ‌డం.. ఇటీవ‌ల కాలంలో పెరిగింద‌ని.. అంత‌ర్జాతీయ మీడియా కొన్నాళ్లుగా క‌థ‌నాలు వెలువ‌రిస్తోంది. దీనికి ద‌న్నుగా మారిన‌ట్టు.. తాజాగా ఇరువురు నేత‌లు కూడా బ‌హిరంగంగానే ముద్దుల వ‌ర్షం కురిపించుకున్నారు. దీనిని స‌మ‌ర్ధించేవారు.. అదే స‌మ‌యంలో వ్య‌తిరేకించేవారు కూడా ఉన్నారు.

Tags:    

Similar News