అమెరికా వెళ్లే విద్యార్థులకు గుడ్ న్యూస్
మాయదారి కరోనా ఎంత ఆగం చేసింది. ఎలా ఉండే ప్రపంచం ఎలానో మారింది. ప్రతి చోటాఅనిశ్చితి. ఏం జరుగుతుందో అర్థం కాదు. ఏం జరగనుందో తెలీదు. అనుకున్నది అనుకున్నట్లుగా.. షెడ్యూల్ కు తగ్గట్లుగా ఏ పని ముందుకు సాగని పరిస్థితి. విదేశాల్లో.. మరి ముఖ్యంగా అమెరికాకు వెళ్లి చదువుకోవాలనుకునే విద్యార్థులు గడిచిన కొన్ని రోజులుగా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆడ్మిషన్ల ప్రక్రియ మొదలు కావటం ఒక ఎత్తు అయితే.. వీసాల జారీ ఎప్పుడు మొదలవుతుందా? అని కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.
నిరీక్షణకు ముగింపు పలికి.. అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు వీసాలు ఇచ్చే కార్యక్రమానికి సంబంధించి అమెరికా రాయబార కార్యాలయం కీలక ప్రకటన చేసింది. సోమవారం నుంచి విద్యార్థులకు వీసా ప్రక్రియను షురూ చేయనున్నట్లు చెప్పారు. జులై.. ఆగస్టు లలో ప్రారంభయ్యే క్లాసులకు విద్యార్థులు అటెండ్ అయ్యేలా వీసాల జారీలో ప్రాధాన్యత ఉంటుందని చెబుతున్నారు.
గతంలో ఉన్నత విద్యను అభ్యసించటానికి అమెరికాకు వెళ్లే విద్యార్థులు.. తమ కాలేజీ స్టార్ట్ అయ్యే తేదీకి ముప్ఫై రోజుల ముందు అమెరికాకు వెళ్లే వీలు ఉండదు. తాజాగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో అలాంటి గడువుతో సంబంధం లకుండా అమెరికాకు వెళ్లేలా అనుమతులు ఇవ్వనున్నారు. కరోనా నేపథ్యంలో అత్యవసర వీసాలు తప్పించి అన్ని రకాల వీసా సేవల్ని ఆపేశారు. సోమవారం నుంచి విద్యార్థులకు వీసాలు ఇచ్చే కార్యక్రమం మొదలు కానుంది. గతంలో వీసాల కోసం అపాయింట్ మెంట్ తీసుకొని రద్దు అయిన వారు సైతం వీసా ఇంటర్వ్యూల కోసం స్లాట్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే.. వెయిటింగ్ లో ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
ఇక వీసా పొంది అమెరికాకు వెళ్లేందుకు మూడు రోజుల ముందు విద్యార్థులు కరోనా పరీక్ష తప్పనిసరి చేయించుకోవాలి. నెగిటివ్ గా నిర్దారణ అయిన వారిని మాత్రమే విమానం ఎక్కేందుకు అనుమతి ఇస్తారు. వ్యాక్సిన్ విషయంలో వర్సిటీల నిర్ణయమే ఫైనల్ అని చెబుతున్నారు. ఆయా విశ్వవిద్యాలయాల పాలసీలకు అనుగుణంగా వ్యాక్సిన్ వేయించుకునే అంశం ఉంటుందని చెబుతున్నారు. ఇక.. టూరిస్టుగా అమెరికాకు వెళ్లాలనుకునే వారికి వీసాలు ఇప్పట్లో జారీ చేయరు. దానికి సంబంధించిన ప్రకటన వేరుగా విడుదలవుతుందని చెబుతున్నారు.