వాహనదారులకు శుభవార్త చెప్పిన కేంద్రం .. డాక్యుమెంట్స్ మర్చిపోయిన నో ప్రాబ్లమ్ !

Update: 2020-10-01 17:30 GMT
వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం తాజాగా శుభవార్త చెప్పింది. కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్  తీసుకువచ్చింది. దీనితో  వాహనదారులకు ఊరట కలుగనుంది. ట్రాఫిక్ పోలీసుల నుంచి వాహనదారులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు అలాగే డిజిటైజేషన్ ప్రోత్సహించాలనే లక్ష్యంతో కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఈ కొత్త రూల్స్  తీసుకొచ్చింది. కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ కొత్త రూల్స్‌ను నోటిఫై చేసింది. అక్టోబర్ 1 నుంచి అంటే ఈ రోజు నుంచి కొత్త రూల్స్ అమలులోకి వచ్చాయి.

వీటి ప్రకారం..వాహనదారులు వెహికల్ డాక్యుమెంట్లను కలిగి ఉండాల్సిన అవసరం లేదు. ఎలక్ట్రానిక్ రూపంలో చూపిస్తే సరిపోతుంది. అది ఎలా అంటే ..  వాహనదారులు వారి వెహికల్ రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్, ఫిట్‌నెస్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్ డాక్యుమెంట్లను డిజిలాకర్ డిజి లాకర్ వంటి సెంట్రల్ గవర్నమెంట్ పోర్టల్‌లో స్టోర్ చేసుకోవచ్చు. వీటిని ట్రాఫిక్ పోలీసులకు చూపిస్తే సరిపోతుంది. మళ్లీ ఫిజికల్ డాక్యుమెంట్లను చూపించాల్సిన పని లేదు. అంతేకాకుండా వాహనదారులు కూడా తప్పులు చేస్తే తప్పించుకోలేరు. రూల్స్ అతిక్రమణలు ఎలక్ట్రానిక్ రూపంలో రికార్డ్ అవుతూ వస్తాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వం రూల్స్‌ను కొంత సవరించింది. ఇప్పుడు వాహనదారులు మొబైల్ ఫోన్స్ ను కూడా వాడచ్చు. అయితే, మొబైల్ ఫోన్స్ ను కేవలం దారి తెలుసుకోవడానికి మాత్రమే ఫోన్‌ను ఉపయోగించాలి. అంటే రూట్ నావిగేషన్కు  ఫోన్ ఉపయోగించొచ్చు. ఇతరత్రా వాటికి ఫోన్ వాడితే మాత్రం జరిమానా పడుతుంది.
Tags:    

Similar News