'గోనె ప్రకాష్ రావు' లోని భారతీయుడు పైకి లేచాడా?

Update: 2022-01-13 11:30 GMT
మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు రూటే సపరేటు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఎంతో ఫైర్ బ్రాండ్.. అప్పట్లో వెలుగు వెలిగిన గోనె తర్వాత ఎన్నికల్లో గెలవలేక ప్రస్తుతానికి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే అధికారులు.. అవినీతి ఎమ్మెల్యేలకు గుబులు పుట్టిస్తున్నారు. అవినీతిని ఆధారాలతో సహా బయటపెడుతూ ఠారెత్తిస్తున్నారు. తాజాగా ఉత్తర తెలంగాణ జిల్లాల ఎమ్మెల్యేల పడ్డారు.

ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల అవినీతి, అరాచకాలు పెరిగిపోతున్నాయని.. తీరు మార్చుకోకుంటే ఆధారాలతో వారి బండారం బయటపెడుతానని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశరావు హెచ్చరించారు.

బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి భూకబ్జాలు, ఇసుక అక్రమ రవాణా తదితర అక్రమాలకు యథేచ్ఛగా తెగబడుతున్నారని ఆరోపించారు. అవినీతినేతలు ఇప్పటికైనా తమ పద్ధతి మార్చుకోవాలని సూచించారు.

జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల విభజన, బదిలీల కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవో 317 లోపభూయిష్టంగా ఉందని.. దీనివల్ల ఇప్పటికే తొమ్మిది మంది ఉపాధ్యాయులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ఈజీవోను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

ఇప్పటికే ఓ కలెక్టర్ అవినీతిపై పోరాటం చేస్తున్న గోనె తాజాగా ఎమ్మెల్యేలపై పడ్డారు. ఇక ప్రభుత్వంపై జోనల్ వ్యవస్థ బదిలీల వ్యవహారంపై ఫైట్ చేస్తున్నారు. మొత్తంగా గోనెలోని 'భారతీయుడు' పైకి లేచాడని అందరూ అంటున్నారు.
Tags:    

Similar News