30 ఏళ్ల తర్వాత జీవితాన్ని సంతృప్తిపరిచే 10 అంశాలివే!
ఇక ఈ దశలో మనం స్టేటస్ కోసం కాకుండా, నాణ్యత కోసం ఖర్చు చేయడం ప్రారంభిస్తాం. వంద మంది స్నేహితులు ఉండటం కంటే, మన కష్టసుఖాలను పంచుకునే ఒక మంచి మిత్రుడు ఉండటమే గొప్ప అనిపిస్తుంది.;
ప్రతి ఒక్కరికి 20 ఏళ్ల వయసులో వేగం, ఆర్భాటం, అందరినీ మెప్పించాలనే తపన ఎక్కువగా ఉంటాయి. కానీ 30 ఏళ్ల వయసులోకి అడుగుపెట్టగానే జీవితం పట్ల అభిప్రాయం పూర్తిగా మారిపోతుంది. అనవసరపు హడావుడి కంటే ప్రశాంతతకు ప్రాధాన్యత ఇస్తాం. బయటి ప్రపంచానికి మనం ఎలా కనిపిస్తున్నామనే దానికంటే, మన అంతరంగం ఎంత సంతోషంగా ఉందనేది ముఖ్యం. జీవితం ఇచ్చే ఈ తీపి పాఠాలు, చిన్న చిన్న విషయాల్లోనే అసలైన సంతృప్తిని ఎలా వెతుక్కోవాలో మనకు నేర్పుతాయి. మరి అలాంటి లక్షణాలు ఇప్పుడు చూద్దాం..
అంతర్గత ప్రశాంతత:
ముప్పై ఏళ్లు దాటిన తర్వాత మన అభిప్రాయాలు పూర్తిగా మారిపోతాయి. ఎవరినో ఇంప్రెస్ చేయడానికి ఇబ్బందికరమైన బట్టలు వేసుకోవడం కంటే, మనకు సౌకర్యంగా ఉండే దుస్తులకే మొగ్గు చూపుతాం. అనవసరపు పనులకు, మనకు ఇష్టం లేని ఆహ్వానాలకు నిర్మొహమాటంగా "నో" చెప్పడం నేర్చుకుంటాం, అది కూడా ఎటువంటి అపరాధ భావం లేకుండా! రణగొణ ధ్వనుల మధ్య పార్టీలు చేసుకోవడం కంటే, ఏ బాధ్యతలు లేని ఒక ప్రశాంతమైన సాయంత్రం ఇంట్లో మన వాళ్ళతో గడపడమే అత్యంత ఆనందాన్ని ఇస్తుంది. ఈ వయసులో గందరగోళం కంటే నిశ్శబ్దమే మనకు ఎక్కువ థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది.
జీవనశైలిలో మార్పు:
ఇక ఈ దశలో మనం స్టేటస్ కోసం కాకుండా, నాణ్యత కోసం ఖర్చు చేయడం ప్రారంభిస్తాం. వంద మంది స్నేహితులు ఉండటం కంటే, మన కష్టసుఖాలను పంచుకునే ఒక మంచి మిత్రుడు ఉండటమే గొప్ప అనిపిస్తుంది. శరీరానికి తగిన విశ్రాంతినిస్తూ, అలారం లేకుండా నిద్రలేవడం, రాత్రి త్వరగా పడుకోవడం వంటి అలవాట్లు భారంగా కాకుండా ఇష్టంగా మారతాయి. క్రమబద్ధమైన దినచర్యలు బోర్ కొట్టించవు, సరిగ్గా చెప్పాలంటే అవే మన జీవితాన్ని హ్యాపీ గా ఉంచుతాయి. ఏ కారణం లేకుండానే శరీరం ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉన్నట్లు అనిపించడం ఈ వయసులో మనం పొందే అతిపెద్ద రివార్డ్.
జీవితం అంటే కేవలం పరుగు పందెం మాత్రమే కాదు, ఇప్పుడున్న పోటీ ప్రపంచం లో పరుగు తప్పదు కానీ,అనవసరపు పోటీ తగదు. ఈ వయసులో ప్రయాణాన్ని ఆస్వాదించడం కూడా అవసరం అని అర్ధం అవుతుంది. ముప్పై ఏళ్ల ప్రాయం అనేది కేవలం వయసు పెరగడం కాదు, మనల్ని మనం మరింత ప్రేమించుకోవడం, మన ప్రశాంతతకు భంగం కలిగించే వేటినైనా వదులుకోవడానికి సిద్ధపడటం. ఒక వయసు వచ్చిన తరువాత అంటే 40 ఏళ్లు వచ్చాక వెనుకకు తిరిగి చూసుకుంటే, నీ మనసుకి నువ్వు హ్యాపీగా జీవితం గడుపుతున్నావ్ అని అనిపించాలి. ఈ చిన్న చిన్న మార్పులే జీవితాన్ని అర్థవంతంగా, సంతృప్తికరంగా మారుస్తాయి.