బంగారం డిమాండ్ పడిపోయిందట.. మనోళ్లు కొనటం తగ్గించారట
మండిపోతున్న బంగారం ధరలు ఒకపక్క.. ఆర్థిక మందగమనం మరోపక్క.. మొత్తంగా బంగారం కొనుగోలు మీద మనోళ్లు ఆసక్తి కాస్త తగ్గిన కొత్త విషయం తాజాగా బయటకు వచ్చింది. అంతకంతకూ పెరుగుతున్న బంగారు ధరలు కూడా అమ్మకాలు తగ్గటానికి కారణంగా చెబుతున్నారు. తాజాగా ప్రపంచ స్వర్ణ మండలి ఒక నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. 2018లో దేశంలో బంగారం డిమాండ్ 760 టన్నులు ఉంటే.. ఏడాది తిరిగేసరికి అది కాస్తా 690 టన్నులకే పరిమితం కావటం గమనార్హం. దీనికి కారణం.. బంగారం ధరలు భారీగా పెరగటంగా చెబుతున్నారు.
అభరణాల డిమాండ్ విషయానికి వస్తే 598 టన్నుల నుంచి 544 టన్నలకు తగ్గిపోయింది. కడ్డీలు.. నాణేల డిమాండ్ 162.4 టన్నుల నుంచి 146 టన్నులకు తగ్గగా.. 2019 అక్టోబరు మాసంలో వచ్చిన థంతేరస్ సందర్భంగా కూడా బంగారాన్ని తక్కువగా కొనుగోలు చేసిన వైనాన్ని బయటపెట్టారు. 2019లో బంగారం ధర భారీగా పెరిగింది. 2019 ఆరంభంలో 99.9 స్వచ్ఛత ఉన్న 10 గ్రాముల ధర రూ.32,190 ఉంటే.. ఒకదశలో అది కాస్తా రూ.40వేల మార్క్ ను దాటింది. సంవత్సరం చివరికి రూ.39వేలకు పరిమితమైంది. ఇంత భారీగా ధర పెరగటం కూడా బంగారం కొనుగోళ్ల మీద ప్రభావాన్ని చూపించాయని భావిస్తున్నారు.
దేశంలో బంగారం అమ్మకాలు తగ్గుముఖం పట్టటం తో బంగారం దిగుమతి తో పాటు.. స్మగ్లింగ్ కూడా తగ్గినట్లుగా అంచనా వేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో 2020లో కూడా బంగారం డిమాండ్ అంతగా ఉండకపోవచ్చంటున్నారు. ఆర్థిక మందగమనం.. కరోనా వైరస్ లాంటి పరిణామాల కారణంగా పసిడి మీద పెట్టుబడి పెట్టటం సేఫ్ గా పెట్టుబడి దారులు భావిస్తున్నారు. దీంతో.. బంగారం ధర మరింత పెరిగింది. ప్రస్తుతం బంగారం పది గ్రాములు 99.9 స్వచ్ఛత రూ.41,790కు చేరటం గమనార్హం.