హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం
అప్పట్లో టాలీవుడ్ లో బయటపడిన డ్రగ్స్ కలకలం ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది. హైదరాబాద్ లోని పబ్ లు డ్రగ్స్ కు అడ్డాలుగా మారాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే మరోసారి హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టుబడడం కలకలం రేపింది.
గోవా నుంచి పెద్ద మొత్తంలో హైదరాబాద్ కు డ్రగ్స్ తీసుకువస్తున్న ఇద్దరిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లోని ఓ ప్రముఖ పబ్ లో మేనేజర్ గా పనిచే్తున్న సల్మాన్ తోపాటు హైమద్ అనే వ్యక్తిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
ఈ సల్మాన్ ద్వారా పది పబ్ లకు డ్రగ్స్ సరఫరా అవుతున్నట్లు విచారణలో తేలినట్లు సమాచారం. డ్రగ్స్ ను సరఫరా చేస్తున్న పబ్స్ డేటాను పోలీసులు బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు.
ఇక గోవా నుంచి డ్రగ్స్ మాత్రమే కాకుండా అమ్మాయిలను కూడా సరఫరా చేస్తున్నట్టు విచారణలో తేలింది. ఈశాన్య రాష్ట్రాల నుంచి అమ్మాయిలు వస్తున్నట్టు తెలిసింది. పబ్ కు వచ్చే వారికి అమ్మాయిల ద్వారా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చినట్టు తెలిసింది. ఈ అమ్మాయిలతోనే వ్యభిచారం సైతం నడిపిస్తున్నట్టు విచారణలో తేలినట్లు సమాచారం.