• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ప్రియురాలి భాద్యత...

ప్రియురాలి భాద్యత ప్రేమికుడిదే .. అలా వదిలేస్తే ఎలా !

By - Tupaki Desk
Update: 2021-11-01 07:36 GMT
ప్రేమించిన అమ్మాయిని బయటకి తీసుకెళ్లే అబ్బాయి , ఆ అమ్మాయి భాద్యతను తీసుకోవాల్సిందే. ఆ అమ్మాయి ని తిరిగి మళ్లీ గమ్యస్థానానికి చేర్చేవరకు పూర్తి భాద్యత ఆ అబ్బాయిదే. సాముహిక అత్యాచారం కేసులో ప్రియడు వేసిన బెయిల్ పిటిషన్ పై అలహాబాద్‌ హైకోర్టు ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. మేజర్‌ అమ్మాయితో పరస్పరం అంగీకారంతో శృంగారంలో పాల్గొంటే అది నేరం కాదని , అయితే, ఈ చర్యను భారతీయ సమాజంలో అనైతిక చర్యగా పరిగణిస్తారని వెల్లడించింది. తనను నమ్మి వచ్చిన ప్రియురాలి గౌరవ మర్యాదలను కాపాడాల్సిన బాధ్యత ప్రియుడిదేనని ,సామూహిక అత్యాచారం కేసులో బాధితురాలి ప్రియుడు వేసిన బెయిల్‌ పిటిషన్‌పై ధర్మాసనం విచారణ జరిపి, నిందితుడికి బెయిల్‌ ఇవ్వడానికి నిరాకరించింది.

గత ఫిబ్రవరి 19న ఉత్తరప్రదేశ్‌ లోని కౌశాంబి జిల్లాకు చెందిన 15ఏళ్ల బాధితురాలు, కుట్టుమిషన్‌ నేర్చుకోవడానికి ఇన్‌ స్టిట్యూట్‌ కు వెళ్లి, అక్కడి నుంచి సమీపంలోని చెరువు వద్దకు చేరుకొని తన ప్రియుడు రాజును కలుసుకుంది. కొంత సమయానికి మరో ముగ్గురు వ్యక్తులు వచ్చి రాజుని బంధించి.. బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత రోజు బాధితురాలు అకిల్‌ సారాయ్‌ పోలీస్‌ స్టేషన్‌ లో ఫిర్యాదు చేయగా రాజుతోసహా నలుగురు నిందితుల్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ ఘటనతో తనకు సంబంధం లేదని, తనకు బెయిల్‌ మంజూరు చేయాలని రాజు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు.

దీనిపై విచారణ సందర్భంగా ధర్మాసనం ప్రియురాలిని కాపాడాల్సిన బాధ్యత ప్రియుడికి ఉందని తెలిపింది. తన ముందే ప్రియురాలిపై అత్యాచారానికి పాల్పడుతుంటే ఏ మాత్రం కాపాడే ప్రయత్నం చేయకుండా నిందితుడు ప్రేక్షక పాత్ర వహించాడని ఆగ్రహం వ్యక్తం చేసింది. అతడి వ్యవహారశైలి సందేహాత్మకంగా ఉందని, అలాగే మిగతా నిందితులతో అతడికి సంబంధాలు ఉన్నాయా.. లేదా అని ఖచ్చితంగా చెప్పలేమని హైకోర్టు తెలిపింది. నిందితుడు రాజుకు బెయిల్‌ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. అలాగే ఈ కేసు విచారణలో భాగంగా అలహాబాద్‌ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక మేజర్‌ అమ్మాయితో పరస్పరం అంగీకారంతో శృంగారంలో పాల్గొంటే అది నేరం కాదని తెలిపింది. అయితే, ఈ చర్యను భారతీయ సమాజంలో అనైతిక చర్యగా పరిగణిస్తారని అలహాబాద్‌ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.


Tags:    
  • latestnews 
  • laterst updates 
  • trending news 
  • Newstoday 
  • Trend News 

Similar News

ట్రంప్ పట్టుకొచ్చాడు.. అతడు వచ్చాడంటే ‘హెచ్1బీ’లకు మూడినట్టే?

2026-11-12 08:16 GMT

ట్రంప్ కు షాకిచ్చిన పాకిస్తాన్.. అమెరికా వ్యూహం ఎందుకు ఫెయిలయ్యింది?

2026-11-12 08:16 GMT

టేస్ట్ ఆఫ్ ఆంధ్రా' నుంచి డిజిటల్ పర్యాటకం వరకు.. సీఐఐ సదస్సు విశేషాలు!

2026-11-12 06:17 GMT

చీపురుపల్లి టీడీపీలో టెన్షన్.. టెన్షన్.. స్థానికంలో బొత్స దూకుడు

2026-11-12 06:05 GMT

బీబీసీకి ఎదురుదెబ్బ.. ట్రంప్ పరువు నష్టం కేసుకు గ్రీన్ సిగ్నల్!

2026-11-12 06:05 GMT

చాక్లెట్ బాక్సును వదలని ‘బాబు’ గారు.. ఆయన ఆలోచన అలా ఉంటుంది మరీ

2026-11-12 05:54 GMT

రాప్తాడు నిందితుడికి తీవ్ర అనారోగ్యం.. బతికినంతకాలం దుర్భర జీవితమే..!?

2026-11-12 05:49 GMT

జెన్సన్‌కు మస్క్ ఉద్యోగం ఇస్తారా? వివాదం మధ్య ఆసక్తికర ఆఫర్!

2026-11-12 05:49 GMT

ప్రభుత్వం మారినా పెట్టుబడుల ఒప్పందాలు మారకూడదు.. చంద్రబాబు కొత్త ఆలోచన!

2026-11-12 05:48 GMT

క్లీన్ సిటీల జాబితాలో ఏపీ సత్తా.. విజయవాడ, విశాఖ, గుంటూరుకు ప్రత్యేక గుర్తింపు!

2026-11-12 05:48 GMT

పవన్ పై సోషల్ మీడియాలో రెచ్చిపోతున్న వారికి గట్టి షాక్.. అరెస్ట్

2026-11-12 04:24 GMT

11 లక్షల కోట్ల టార్గెట్ ..దావోస్ కి ధీటుగా వైజాగ్ సమ్మిట్

2026-11-12 03:23 GMT

Copyright @2026

Powered by Blink CMS