పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలు
గతంలో జరిగిన రిజర్వేషన్ల పద్దతిలోనే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసి) ఎన్నికల రిజర్వేషన్లు జరగబోతున్నాయి. డిసెంబర్ 1వ తేదీన జీహెచ్ఎంసి ఎన్నికలు నిర్వహించాలని స్టేట్ ఎలక్షన్ కమీషనర్ పార్ధసారధి ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తం 150 డివిజన్లకు జరగబోయే ఎన్నికలను గతంలో ప్రభుత్వం నిర్ణయించిన రిజర్వేషన్ల ప్రకారమే జరుగుతాయని కూడా ఆయన చెప్పారు. కమీషన్ చెప్పిన ప్రకారం ఎస్టీలకు 2 డివిజన్లు, ఎస్సీలకు 10, మహిళలకు 75, జనరల్ కోటాలో 44 డివిజన్లు కేటాయించినట్లు కమీషనర్ చెప్పారు. మేయర్ స్ధానాన్ని జనరల్ మహిళకు కేటాయించినట్లు కూడా కమీషన్ ప్రకటిచింది.
అయితే రిజర్వేషన్ల ప్రక్రియపై కోర్టులో కేసులు నమోదయ్యాయి. పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలు నిర్వహించటం అన్యాయమంటు కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ కోర్టులో కేసు వేశారు. అలాగే రిజర్వేషన్లలో రొటేషన్ సిస్టమ్ రూపొందించిన తర్వాత ఎన్నికలు జరపాలని బీజేపీ కూడా డిమాండ్ చేసింది. అయితే కాంగ్రెస్ నేత వేసిన కేసును హైకోర్టు కొట్టేసింది. రిజర్వేషన్లపై ఏవైనా అభ్యంతరాలుంటే ఇన్ని సంవత్సరాలు ఏమి చేస్తున్నారంటు మండిపడింది. కేసు కేవలం రాజకీయ కారణాలతోనే వేసినట్లుందంటు కోర్టు మండిపడింది.
రిజర్వేషన్ల విషయంలో తాము జోక్యం చేసుకునే అవకాశం లేదని కోర్టు స్పష్టంగా ప్రకటించేసింది. అలాగే రొటేషన్ విధానం కూడా పూర్తిగా ప్రభుత్వ ఇష్టమని కోర్టు తేల్చి చెప్పింది. దాంతో ఇటు కాంగ్రెస్ అటు బీజేపీకి ఒకేసారి షాక్ తగిలినట్లయ్యింది. దాఖలైన కేసులను కోర్టు కొట్టేయటంతో చేసేది లేక పార్టీలు ఎన్నికలకు సమాయత్తమవుతున్నాయి.