జీహెచ్ఎంసీ ఎఫెక్ట్: టీఆర్ఎస్ నాయకురాలి ఇంటిపై దాడి
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఈసారి అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య నువ్వానేనా అన్నట్టుగా సాగాయి. ఒకరినొకరు మాటల యుద్ధం చేసుకున్నారు. అభ్యర్థులు దాడులు ప్రతిదాడులతో హీటు పుట్టించారు. అయితే ఎన్నికలు ముగిసి చాలా రోజులు గడుస్తున్నా ఇంకా ఆ సెగలు, పొగలు చల్లారడం లేదు. ఆ ఎఫెక్ట్ తాజాగా కూడా కొనసాగుతోంది.
హైదరాబాద్ రాజేంద్రనగర్ లో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య దాడుల పరంపర కొనసాగుతూనే ఉంది. ఆదివారం మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వినాయకనగర్ లో టీఆర్ఎస్ మహిళా నాయకురాలు చైతన్యరెడ్డిపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో ఆమెకు గాయాలయ్యాయి. ఇంట్లోని ఫర్నీచర్ మొత్తం ధ్వంసమైంది.
తన ఇంటిపై బీజేపీ నేతలే దాడులకు పాల్పడ్డారని చైతన్య రెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు దుండగులను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఇక బీజేపీ కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి వాహనంపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. ఎన్నికల అనంతరం దాదాపు ఐదు సార్లు బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ఘర్షణలు జరిగాయి. ఇరు పార్టీల నేతలు పరస్పరం దాడులు చేసుకుంటున్నారు. పోలీసులు ఈ దాడులపై నజర్ పెంచారు.