దేశంలో క‌ల్లోలం: మోడీ కామెంట్లే కార‌ణ‌మా?

గ‌త రాత్రి నుంచి తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్‌లో పెట్రోలు బంకులకు తాళం వేశారు.;

Update: 2026-03-25 09:50 GMT

గ‌త రాత్రి నుంచి తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్‌లో పెట్రోలు బంకులకు తాళం వేశారు. మ‌రికొన్ని చోట్ల తాళం వేయ‌క‌పోయినా.. `నోస్టాక్‌` బోర్డులు క‌నిపిస్తున్నాయి. దీంతో ద్విచ‌క్ర వాహ‌నదారుల నుంచి కార్ల య‌జ‌మానుల వ‌ర‌కు కూడా తీవ్ర‌స్థాయిలో ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. అయితే.. ఈ ప‌రిస్థితి ఇక్క‌డ ఒక్క‌చోటే ఉంద‌ని అనుకుంటే పొర‌పాటే.. దేశ‌రాజ‌ధాని ఢిల్లీ స‌హా యూపీ రాజ‌ధాని ల‌క్నో, పంజాబ్ రాజ‌ధాని జ‌లంధ‌ర్‌, రాజ‌స్థాన్‌, చెన్నై, తిరువ‌నంత‌పురం ఇలా.. దాదాపు 18 రాష్ట్రాల్లో ఇదే ప‌రిస్థితి క‌నిపించింది.

కార‌ణం ఏంటి?

ప్ర‌స్తుతం ప‌శ్చిమాసియాలో నెల‌కొన్న ప‌రిస్థితులు.. యుద్ధంపై అమెరికా దోబూచులాడ‌డం, మరోవైపు.. అమెరికా కాద‌న్నా.. ఆగినా.. కూడా తాము మాత్రం యుద్ధాన్ని ఆపేది లేద‌ని ఇజ్రాయెల్ ప్ర‌క‌టించ‌డం.. యుద్ధం కొన‌సాగుతుండ‌డంతో స‌హ‌జంగా చ‌మురు ర‌వాణా వ్య‌వ‌స్థ‌లు ఇంకా సాధార‌ణ స్థితికి చేరుకోలేదు. మ‌రోవైపు.. చ‌మురు ధ‌ర‌లు బ్యారెల్‌కు 100 డాల‌ర్ల‌కు పెరిగిపోయింది. దీంతో పాకిస్థాన్ స‌హా.. ప‌లు దేశాలు.. చ‌మురును కొనుగోలు చేయ‌డం మానేశాయి. అంతేకాదు.. వాటిపై ఇస్తున్న రాయితీల‌ను కూడా నిలిపివేశాయి.

దీంతో ప్ర‌పంచ వ్యాప్తంగా సంక్షోభం నెల‌కొంది. అయితే.. ఈ విష‌యంలో భార‌త్ కొంత మేలిమిగానే ఉంద‌ని చెప్పారు. అర్జెంటీనా స‌హా . ర‌ష్యా వంటి కీల‌క చ‌మురు ఉత్ప‌త్తి దేశాల నుంచి భారీ ఎత్తున కొనుగోలు చేస్తోంది. అదే స‌మ‌యంలో చ‌మురు నిక్షేపాల‌ను ఇంకా వెలికి తీయ‌లేదు. సో.. ఒ ర‌కంగా చూసుకుంటే.. మ‌న‌కు వ‌చ్చే నాలుగు మాసాల వ‌ర‌కు కూడా ఎలాంటి ఇబ్బందులు లేని విధంగానే చ‌మురు నిల్వ‌లు, గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయి.

మోడీ వ్యాఖ్య‌ల‌తో..

కానీ.. మంగ‌ళ‌వారం.. పార్ల‌మెంటులో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ చేసిన రెండు కీల‌క ప్ర‌క‌ట‌నలు.. ఈ సంక్షోభ స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌ను తీవ్ర గంద‌ర‌గోళానికి గురి చేశాయి. 1) ఈ సంక్షోభ స‌మ‌యంలో ప్ర‌జ‌లు అంద‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాలి. ఎలాంటి ప‌రిస్థితినైనా ఎదుర్కొనేందుకు రెడీగా ఉండాలి. 2) క‌రోనా నాటి ప‌రిస్థితులు ప్ర‌స్తుతం మ‌న‌కు ఎదుర‌వుతున్నాయి. ఈ రెండు వ్యాఖ్యలు.. ప్ర‌జ‌ల్లో తీవ్ర గంద‌ర‌గోళానికి గురి చేశాయి. ఎప్పుడేక్ష‌ణంలో ఏం జ‌రుగుతుందో అనే కార‌ణంగా.. పెట్రోల్ బంకుల ముందు.. గ్యాస్ డీల‌ర్ల ముందు.. క్యూ క‌ట్టారు. ఇక‌, ఆయా బంకుల య‌జ‌మానులు కూడా .. ప్ర‌స్తుతం బ్లాక్‌లో విక్ర‌యిస్తున్నార‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. మ‌రికొంద‌రు నిల్వ‌లు దాచిపెడుతున్నారు. దీంతో ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా క్యూలు.. క‌నిపిస్తున్నాయి.

Tags:    

Similar News