• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో 54...

ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో 54 రోజులుగా ఒంటరిగా!

By - Tupaki Desk
Update: 2020-05-11 07:45 GMT
లాక్‌ డౌన్‌ నేపథ్యంలో జర్మనీకి చెందిన 40 ఏళ్ల వ్యక్తి ఒకరు ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. ఎడ్గార్డ్ జీబాట్ అనే జర్మన్‌ జాతీయుడు 54 రోజులుగా ఒంటరిగా ఇక్కడే ఉండిపోయాడు. మార్చి 18న హనోయి నుంచి ఇస్తాంబుల్ ‌కు వెళ్తూ  అతడు ఇక్కడ చిక్కుబడిపోయాడు. మహమ్మారి  వ్యాప్తి నేపథ్యంలో టర్కీ నుంచి, అక్కడి నుంచి బయలుదేరే అన్ని విమానాలను భారత్ రద్దు చేసింది. నాలుగు రోజుల తర్వాత అన్ని అంతర్జాతీయ విమానాలను నిలిపివేసింది. మార్చి 25 నుంచి దేశవ్యాప్తంగా లాక్‌ డౌన్‌ విధించి కొనసాగిస్తోంది

ఇతర ప్రయాణికుల మాదిరిగా ఎడ్గార్డ్ జీబాట్ ‌ను జర్మనీ రాయబార కార్యాలయానికి అప్పగించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తమ దేశంలో అతడికి నేరచరిత్ర ఉన్నందున అతడిని క్వారంటైన్ ‌ను పంపడానికి ఢిల్లీలోని జర్మనీ రాయబార కార్యాలయం నిరాకరించింది. నేర చరిత్ర ఉన్నందున భారత్‌ కూడా అతడికి వీసా ఇవ్వలేదు. అతడిని స్వదేశానికి పంపే విషయంపై జర్మన్ రాయబార కార్యాలయాన్ని సంప్రదించినా ఇప్పటివరకు స్పందన రాలేదని భారత అధికారులు తెలిపారు.

జీబాట్‌ మార్చిన 18న వియత్నాం నుంచి వీట్ ‌జెట్‌ ఎయిర్ విమానంలో ఢిల్లీ వచ్చాడు. తన గమ్య స్థానానికి వెళ్లే విమానాలన్నీ రద్దు కావడంతో ఇక్కడే ఉండిపోయాడు.  దినపత్రికలు, మేగజీన్స్‌ చదువుతూ.. కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడుతూ అతడు కాలక్షేపం చేస్తున్నాడు. తాను కోరుకున్న చోటికి వెళ్లిపోవచ్చని చెప్పినా విమాన సర్వీసులు లేకపోవడంతో అతడు వెళ్లలేక పోతున్నాడని విమానాశ్రయ అధికారులు తెలిపారు. రిలీఫ్‌ విమానంలో అంకారాకు పంపేందుకు ప్రయత్నించినా టర్కీ అందుకు ఒప్పుకోకపోవడంతో  కుదరలేదని వెల్లడించారు. విమాన సర్వీసులు తిరిగి ప్రారంభం అయ్యేవరకు అతని నిరీక్షణ తప్పదు. కాగా, జీబాట్‌ తో మాట్లాడేందుకు మీడియా ప్రతినిధులను సెక్యురిటీ సిబ్బంది అనుమతించలేదు
Tags:    
  • German man 
  • Delhi airport 
  • Telugu News 
  • Latest Telugu News 
  • Telugu Daily News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

సీఎంగా లోకేష్.... చంద్రబాబు పాత్ర ఏంటి....రాజకీయ సమీకరణాలు ఎన్నో !

2026-11-20 17:30 GMT

సహజీవనంలో పుట్టిన బిడ్డ.. ఎవరికి హక్కు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

2026-11-20 17:28 GMT

మంత్రిగారు.. స్పీక‌ర్‌గారూ.. టీడీపీలో ఇంట్ర‌స్టింగ్ డిబేట్‌.. !

2026-11-20 17:27 GMT

కొత్త బండికి మూడేళ్ల స్వేచ్ఛ.. పాత బండికి ఆరు నెలలకో అగ్నిపరీక్ష

2026-11-20 17:26 GMT

వైఎస్ భారతీరెడ్డికి వైసీపీ కీలక బాధ్యతలు.. ఇప్పటికే రంగంలోకి దిగిన మేడం!

2026-11-20 17:25 GMT

విశాఖ కొత్త మేయర్ ఇంట పెను విషాదం.. కూతురి ప్రమాణస్వీకారం చూడకుండానే తండ్రి కన్నుమూత

2026-11-20 17:23 GMT

ఉత్తరాదికి అందలం.. దక్షిణాదికి మొండిచేయి.. అభివృద్ధి అంటే భవనాలు కట్టడమేనా మోదీజీ?

2026-11-20 17:23 GMT

రాజమండ్రిలో ఆసక్తికర పోటీ.. హర్షకుమార్ కోడలు, వైసీపీ రెబల్ ప్రభావం ఎంత?

2026-11-20 17:22 GMT

గ్యారెంటీ లేని జడ్పీ పీఠం.. చిన్న శ్రీను కూతురు సిరి సహస్రకు బీసీ గండం?

2026-11-20 17:22 GMT

పవన్ ఇంటి వద్ద హైడ్రామా.. అప్పులు తీర్చాలని అభిమాని ఆత్మహత్యాయత్నం!

2026-11-20 17:18 GMT

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

Copyright @2026

Powered by Blink CMS